
న్యూయార్క్ : సాక్షాత్తు సేవలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి పంపించిన వ్యక్తులే లైంగిక దాడులకు పాల్పడ్డారు. పలుచోట్ల లైంగిక వేధింపులకు దిగారు. 2016కుగాను మొత్తం 138 మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ప్రతినిధి బృందాల్లోని వ్యక్తులపై వచ్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఐక్యారాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటర్స్ మాట్లాడుతూ శాంతి వర్దిల్లేందుకు సహాయపడే 10 బృందాల్లోని 62 మందిపై లైంగిక పరమైన కేసులు నమోదు అయ్యాయని, మిగితా 104 కేసులు వివిధ పొలిటికల్ మిషన్‌లకు సహాయకపడే వారిపై నమోదైనట్లు చెప్పారు.
అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గినట్లు ఆయన వెల్లడించారు. 'మరోసారి మేం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. లైంగిక పరమైన దాడులు చేసే వ్యక్తులు, వేధింపులకు పాల్పడే వారు ఎట్టిపరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి విభాగాల్లో ఉండొద్దు. మున్ముందు ఇలాంటి వాటిని పూర్తిగా రూపుమాపాలని నిర్ణయించుకున్నాం. 2018 మరింత తగ్గించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం' అని గటర్స్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment