భర్త హత్యకు సుపారీ | Wife Pay To Supari Killers For Husband Murder Karnataka | Sakshi
Sakshi News home page

భర్త హత్యకు సుపారీ

Published Fri, Jun 29 2018 7:46 AM | Last Updated on Fri, Jun 29 2018 7:46 AM

Wife Pay To Supari Killers For Husband Murder Karnataka - Sakshi

పట్టుబడిన నిందితులు

మండ్య : ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ ఏకంగా తన భర్త హత్యకు సుపారీ ఇచ్చిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  వివరాలు...మండ్య తాలూకాలోని యలియూరు గ్రామానికి చెందిన ఓ యువతికి ఐదేళ్ల క్రితం పుర కొప్పలు గ్రామానికి చెందిన రమేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రమేశ్‌ జేసీబీ డ్రైవర్‌. దీంతో రెండు వారాలకొకసారి ఇంటికి వచ్చేవాడు. పెళ్లి అయినా కూడా సదరు యువతి తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటోంది.

ఈ నేపథ్యంలో దూరపు బంధువు అనిల్‌ తరచూ ఇంటికి వచ్చేవాడు. దీంతో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. శాశ్వతంగా ప్రియుడు అనిల్‌ కుమార్‌తో కలిసి జీవించడానికి ఆమె పథకం పన్నింది. భర్తను హత్య చేయించడానికి కిరాయి హంతకులకు రూ. లక్ష సుపారీ ఇచ్చింది. ఈనెల 9న శివమొగ్గ నుంచి బస్సులో వచ్చిన రమేశ్‌ను బైక్‌లో తీసుకుని వస్తుండగా అప్పటికే ఓ నిర్జన ప్రదేశంలో చన్నెగౌడ, పుట్టస్వామిలు రమేశ్‌పై దాడి చేశారు. ఇదే సమయంలో అదే రోడ్డులో వాహనాలు వస్తుండటంతో వారు పారిపోయారు. అనిల్‌ కూడా వారితో పాటు ఉడాయించాడు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు చెన్నగౌడ, పుట్టస్వామిలను అరెస్ట్‌ చేశారు. వివాహిత కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement