
సాక్షి, గౌరిబిదనూరు(కర్ణాటక): ఈనెల 14న జోడీబిసలహళ్లిలో హత్యకు గురైన బిఎస్ శ్రీనివాసమూర్తి (59) కేసును పోలీసులు ఛేదించారు. రాత్రివేళ పొలంలో ఉన్న సమయంలో ఈయన హత్యకు గురయ్యాడు. వివరాలు... ఎస్ శ్రీనివాసమూర్తి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు. వ్యాపార అవసరాల కోసం పలుచోట్ల భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చాలని తరచూ వడ్డీ వ్యాపారస్తులు ఒత్తిడి తెచ్చేవారు.
దీంతో శ్రీనివాసమూర్తి కుమారుడు రవికుమార్ ఈ అవమానాలను భరించలేక తండ్రిని హత్య చేయడానికి జోడీబిసలహళ్లికి చెందిన రంగనాథ్‌తో ఒప్పందం చేసుకుని రూ. 30 వేలు అడ్వాన్సు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment