
సాక్షి, విశాఖపట్నం : తన భర్తతో చట్టవ్యతిరేకంగా కాపురముంటున్న మహిళను పోలీసుల ముందే విచక్షణా రహితంగా చితక బాదిందో ఇళ్లాలు. ఈ సంఘటన విశాఖపట్నం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖకు చెందిన గంగాధర్ రెడ్డికి భార్య పుష్పలత, కొడుకు ఉన్నారు. అయితే గత కొద్దినెలలుగా అతడు భార్య, కుమారుడిని వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడు. షీలానగర్ తులసి అపార్ట్‌మెంట్‌లో చట్టవ్యతిరేకంగా ప్రియురాలితో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం భార్య పుష్పలత, మహిళా సంఘాలు గంగాధరరెడ్డి ఇంటివద్దకు చేరుకున్నాయి. గంగాధర్ సదరు మహిళతో ఇంట్లో ఉండగా బయట తాళాలు వేసి ఆందోళన చేపట్టాయి.
కొద్దిసేపటి తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు ఇంట్లో ఉన్న ఇద్దరినీ బయటకు తీసుకువచ్చారు. భర్తను రెండు దెబ్బలు కొట్టివదిలేసిన పుష్పలత అతడి ప్రియురాలిని పోలీసుల ముందే విచక్షణా రహితంగా చితకబాదింది. దీంతో కొద్దిసేపు అపార్ట్‌మెంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు వారిని పెందుర్తి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
చదవండి : ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..


Comments
Please login to add a commentAdd a comment