ప్రాణం తీసిన టీవీ సీరియల్‌ | Woman Died in Fire Accident While Watching TV Serials Tamil nadu | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన టీవీ సీరియల్‌

Published Thu, Feb 20 2020 9:58 AM | Last Updated on Thu, Feb 20 2020 9:58 AM

Woman Died in Fire Accident While Watching TV Serials Tamil nadu - Sakshi

చెన్నై,తిరువొత్తియూరు: ఇంటికి నిప్పు అంటుకున్నా టీవీ సీరియల్‌లో లీనమైన ఓ వివాహిత మంటల్లో చిక్కుకుని మృతి చెందిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. కామరాజపురం భగత్‌సింగ్‌ వీధికి చెందిన రమేష్‌ భార్య మహాలక్ష్మి (41). కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు పిల్లలతో భర్త వేరుగా ఉంటున్నాడు. బంధువు ఇంటిలోని మిద్దెపై మహాలక్ష్మి అద్దె ఇంటిలో ఉంటోంది. మంగళవారం సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించిన తరువాత టీవీ సీరియల్‌ చూడడానికి కింద ఇంటికి దిగి వచ్చింది. దీపం ఒరిగి ఇంటికి మంటలు అంటుకుంది. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు మహాలక్ష్మికి తెలిపారు. దీంతో ఆమె దిగ్భ్రాంతి చెంది పైకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించడంతో మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement