మృతిచెందిన సుశీల
కోదాడరూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని చిమిర్యాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొండ సుశీల (55)ఏపీలోని మక్కపేటకు మిరప కూలీ పనులకు వెళ్తుంది.
బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ గడిపూడి శ్రీకాంత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment