మృతిచెందిన కీర్తన
జిన్నారం(పటాన్‌చెరు) : గుమ్మడిదల మండలంలోని బొంతపల్లికి చెందిన కీర్తన(24)అనే మహిళ బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు. కీర్తన ఉదయం మంచం మీద నుంచి కిందపడడంతో మృతి చెందిందని భర్త తెలిపాడు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని కీర్తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment