
షబరీన్ బాను (ఫైల్‌ఫొటో)
కర్ణాటక ,మైసూరు: భర్త మరణానంతరం తనకు చెందాల్సిన ఆస్తి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం నగరంలోని కళ్యాణినగర్‌లో చోటు చేసుకుంది. షబరీన్ బాను (31)కు 15 ఏళ్ల క్రితం సయ్యద్ అజ్మద్ అనే వ్యక్తితో వివాహమైంది. ఎనిమిదేళ్ల క్రితం కుటుంబ కారణాలతో సయ్యద్ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ పోషణ కోసం షబరీన్ విదేశాలకు వెళ్లారు. కొద్ది కాలం క్రితం మైసూరుకు వచ్చిన షబరీన్ బెంగళూరు నగరంలో ఉన్న భర్తకు చెందిన ఆస్తి తనకే చెందాలంటూ అధికారుల చుట్టూ తిరిగారు. ఆస్తిని విక్రయించి ఇద్దరు పిల్లల చదువులు, కుటుంబ పోషణకు సాధ్యమవుతుందంటూ ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment