మంజుల (ఫైల్)
చందంపేట(దేవరకొండ) యాదాద్రి : తొలి ఏకాదశిని పురస్కరించుకుని దైవ దర్శనానికి వెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంతో కానరానిలోకాలకు వెళ్లింది. ఈ ఘటన చందంపేట మండలంలోని దేవరచర్ల శివారులో సోమవారం జరిగింది. ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపిన ప్రకారం.. నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామానికి చెందిన కలకటి మం జుల(21), భర్త అంతయ్య, ఏడు నెలల కుమార్తెతో కలిసి దేవరచర్ల మునిస్వామి ఆలయానికి బైక్‌పై బయలుదేరారు.
ఆలయ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా సివిల్ సప్లయ్ కిరోసిన్ ట్యాంకర్ ఎదురుగా రావడంతో అంత య్య ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడిం ది. దీంతో మం జుల బైక్ పైనుం చి కిందపడింది. వేగంగా వస్తున్న ట్యాంకర్ మంజు ల పైనుంచి వెళ్లడంతో ఆమె ము ఖం ఛిద్రమైంది.
దీంతో మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో అంతయ్య, కుమార్తెకు స్వల్పగా గాయాలయ్యా యి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మే రకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా కంబాలపల్లి గ్రా మానికి చెందిన సీత శ్రీనివాస్ తన భార్య పిల్లలతో కలిసి బైక్‌పై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment