
మహిళను తాళ్లతో స్తంభానికి కట్టేసిన దృశ్యం
నెక్కొండ : మద్యం మత్తులో ఓ మహిళ అర్ధరాత్రి హల్‌చల్ చేయడంతో గ్రామస్తులు ఆమెను పట్టుకుని కట్టివేసి చితకబాదిన సంఘటన మండలంలోని పనికర గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గ్రామంలోని ఓ ఇంటి తలుపులు కొట్టి శబ్దం చేసింది. దీంతో మేల్కొన్న ఇంట్లోవారు దొంగాదొంగా అంటూ కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు మేల్కొని మద్యం మత్తులో ఉన్న మహిళను పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు.
తనతోపాటు మరో ఐదుగురు ఉన్నారని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులకు సైతం తనది చింతనెక్కొండ, బంజరుల్లి, కొండాపురం, అమీన్‌పేట గ్రామమనని వేర్వేరు సమాధానాలు చెప్పింది. మహిళ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేసి చింతనెక్కొండకు పంపించారు. ఈ విషయమై ఎస్సై నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment