
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీఐ
ఇంకొల్లు: ఫేస్‌బుక్‌లో ఓ యువతికి సంబంధించిన అసభ్య ఫొటోలు పోస్టు చేసిన యువకుడిని ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు శుక్రవారం వలపన్ని అరెస్టు చేశారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని పావులూరుకు చెందిన చిడిపూడి శివశంకరరెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రతిపాదించాడు. ఇందుకు యువతి పెద్దలు నిరాకరించారు. కక్ష పెంచుకున్న శివశంకరరెడ్డి.. ఆ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి పేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకొల్లు పోలీసులు సైబర్ నేరంగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి పర్చూరు కోర్టుకు హాజరు పరిచారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ శేషగిరిరావు హెచ్చరించారు. కేసు దర్యాప్తునకు సహకరించిన ఎస్‌ఐ వి.రాంబాబు, సిబ్బందిని సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment