
ముంబై : రూ.150 కోసం తన స్నేహితుడిని హత్య చేశాడు యువకుడు. ఈ ఘటన దక్షిన ముంబైలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూషణ్ షేక్ అలియాస్ చుల్‌బుల్, రియాజ్ షేక్(23) ఇద్దరు స్నేహితులు. సౌత్‌ముంబైకి చెందిన వీరు, భౌచా దక్కా చేపల మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌కి ముందు చుల్‌బుల్ నుంచి రియాజ్ రూ.150 అప్పుగా తీసుకున్నాడు.
గత శుక్రవారం చుల్‌బుల్ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని రియాజ్‌ని అడిగాడు. దానికి రియాజ్ తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పాడు. చుల్‌బుల్ శనివారం ఉదయం మళ్లీ రియాజ్ ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన చుల్‌బుల్ బడ్డరాయితో రియాజ్ తలపై బలంగా మోది పారిపోయాడు. రక్తపు మడుగులో పడిపోయిన రియాజ్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. రియాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చుల్‌బుల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment