పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు | 10th Class tests | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

Published Sat, Feb 25 2017 11:18 PM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

10th Class tests

నాగార్జునసాగర్‌: మార్చి 14 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు డీఈఓ చంద్రమోహన్‌ తెలిపారు. శుక్రవారం స్థానికంగా పెద్దవూర ఎంఈఓ ప్రభాకర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో మూడు ప్రైవేట్‌ అభ్యర్థుల కోసం, వంద సెంటర్లు రెగ్యులర్‌ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 21,854 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం 103 మంది సీఎస్‌లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, కస్టోడియన్లను నియమించామన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఆరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పూర్చి చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక  కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement