Tenth class tests
-
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
నాగార్జునసాగర్: మార్చి 14 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా పెద్దవూర ఎంఈఓ ప్రభాకర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో మూడు ప్రైవేట్ అభ్యర్థుల కోసం, వంద సెంటర్లు రెగ్యులర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 21,854 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం 103 మంది సీఎస్‌లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లను నియమించామన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పూర్చి చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
టెన్షన్ వద్దు
సిటీబ్యూరో: టెన్త్ క్లాస్పరీక్షలు వచ్చేశాయి.. ఈనెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. పరీక్షలు వస్తున్నాయనే ఆందోళన చెందకండని నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. పరీక్షలకు మొత్తం 1.78 లక్షల మంది రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 791 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రె గ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు వేర్వేరు సెంటర్లు కేటాయించారు. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరగుతాయి. ద్వితీయ భాష పరీక్ష మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆయా స్కూళ్లకు పంపించారు. ఫీజు విషయంలో స్కూల్ యాజ మాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే.. హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌల్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విద్యాశాఖ కల్పించింది. డౌల్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై సదరు స్కూల్ ప్రధానోపాధ్యాయులు లేదంటే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షకు హాజరుకావాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్ తెలిపారు. ఈ హాల్‌టికెట్లతో వచ్చే విద్యార్థులను పరీక్ష రాసేందుకు తప్పక అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 21, రంగారెడ్డి జిల్లాలో 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించనున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాల చిరునామా తదితర విషయాలపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాన్ని హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచే ఇవి పనిచేస్తాయి. ఇబ్బందులు తలెత్తకుండా... వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీటికి కొరత లేకుండా చూస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు తాగునీటికి ఇబ్బందులు లేకపోవచ్చు. పరీక్షలు ముగిసేంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్‌ను అందుబాటులో ఉంచుతారు. అలాగే కేంద్రాల్లో ప్రథమ చికిత్స పెట్టెలతోపాటు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. డీ హైడ్రేషన్, వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడే చికిత్స అందిస్తారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జంట జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రమంజిల్‌లో సీసీ కెమెరాలు నగరంలోని ఉన్నత పాఠశాలల్లో నిఘా నీడన పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాకో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఒక పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎర్రమంజిల్ పాఠశాలలో మొత్తం 10 కెమెరాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో 8, ప్రధానోపాధ్యాయుని చాంబర్ , బడి ఆవరణలో ఒకటి చొప్పున బిగించారు. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. పదో తరగతి పరీక్షలంటేనే కొంత ఆందోళన సహజమని, దాన్ని దూరం చేసేలా విద్యార్థులను సన్నద్ధం చేశామని డీఈఓలు పేర్కొన్నారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా, పాఠ్యాంశాలను అర్థం చేసుకుని చక్కగా సమాధానాలు రాసేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు. గతంలా కాకుండా.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇలా చేయండి పరీక్షకు ముందు రోజు సెంటర్‌ను ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది. పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. కనీసం ఉదయం 8.45 గంటలలోపు ఉండాలి సెల్ఫోన్లు, క్యాలిక్లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహారం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. జ్యూస్‌లు తీసుకుంటే నీరసం రాదు. ఒకవేళ హాల్‌టికెట్ పోగొట్టుకున్నా, ఫీజలు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www.bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. -
తొలి రోజు ప్రశాంతం
నో డీబార్ కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యూరుు. మొత్తం 63,128 మంది విద్యార్థులకు గాను 62,785 మంది విద్యార్థులు హాజరయ్యారు. 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలిరోజు జరిగిన పరీక్షలో మాస్‌కాపీయింగ్ పాల్పడినవిద్యార్థులు ఎవరూ లేకపోవడం విశేషం. జిల్లాలో 274 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా విద్యాధికారి 11 కేంద్రాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 85 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షను పర్యవేక్షించారు. మారిన సెలబస్‌లో పరీక్ష రాస్తున్న దృష్ట్యా అరగంట ముందే కేంద్రంలోని అనుమతిస్తారని, 15 నిమిషాలు ప్రశ్నాపత్రానికి సమయం ఇస్తారని ప్రకటించడంతో విద్యార్థులు ఉదయం 8గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రావడంతో అంతటా కోలాహలం కనిపించింది. బెస్టాఫ్ లక్, మంచిగా రాయు, టెన్షన్ పడకు, మొదటగా వచ్చినవి రాయు... అంటూ తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వారిని ఆశీర్వదించి పరీక్ష హాల్లోకి పంపించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. రాష్ట్ర పరిశీలకులు లక్ష్యారెడ్డి, జిల్లా విద్యాధికారి లింగయ్య పరీక్షల తీరును పర్యవేక్షించారు. అరకొర వసతులతో ఇబ్బందులు పది పరీక్షలను పక డ్బందీగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకొన్న జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ముందే ఏర్పాట్లను పూర్తి చేశాం... ఎక్కడా అసౌకర్యాలు లేవని చెప్పగా... జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అరకొర వసతుల నడుమ పరీక్షలను రాశారు. రామగుండం మండలంలోని పలు సెంటర్లలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు సరిపడే డెస్క్‌లను సమకూర్చలేకపోయారు. మంథని డివిజన్లోని పలు కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయడానికి బెంచీలు లేక నేలపై కూర్చుని రాశారు. జగిత్యాలలో సైతం అసౌకర్యాలతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కథలాపూర్ మండలంలోని ఓ పరీక్ష కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హల్చల్ చేశాయి. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్లతో పాటు సకల సౌకర్యాలు కల్పించడం విమర్శలకు తావిచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు సెంటర్లలో విద్యార్థులకు అసౌకర్యాలు తప్పలేదు. ఎన్టీపీసీ జ్యోతినగర్‌కు చెందిన యమున అనే విద్యార్థిని భారమైన హృదయంతో పరీక్ష రాసింది. అనారోగ్యంతో గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తండ్రి పీఠాపురం శంకర్(45) బు దవారం మృతి చెందాడు. తండ్రి మృతదేహం మా ర్చురీలో ఉండగా, యమున దుఃఖాన్ని దిగమింగుం టూ తెలుగు పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరై కన్నీటిపర్యంతమైంది. -
‘పది’లమే!
రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు హాజరుకానున్న 80,349 మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లోఆందోళన వద్దు డీఈఓ సోమిరెడ్డి సిటీబ్యూరో: పాఠ్యాంశాలతో పాటు పరీక్ష విధానంలో మార్పుల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురవకుండా... ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేలా సన్నద్ధం చేశామని హైదారాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి సోమిరెడ్డి తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే నెల 11వ తేదీ వరకు కొనసాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అవసరమైతే ఒక రోజు ముందుగా కేంద్రాన్ని చూసుకుంటే... పరీక్ష రోజున ఆందోళనకు తావుండదన్నారు. ‘పది’ పరీక్షల నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 80 వేల మంది విద్యార్థులు హైదరాబాద్ జిల్లాలో 80,349 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 66,071 మంది రె గ్యులర్, 14,278 మంది ప్రైవేట్ విద్యార్థులు. వీరికి వేర్వేరుగా 292 కేంద్రాలు ఏర్పాటు చేశాం. 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించాం. వారు నిరంతరం కేంద్రాల్లో తనిఖీలు చేపడతారు. ఎక్కడికి వెళ్లేదీ అప్పటికప్పుడే నిశ్చయించుకుంటారు. జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక కేంద్రాలు లేవు. మొత్తం 4,020 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. ప్రతి కేంద్రాన్నీ చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. సౌకర్యాలపై దృష్టి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అన్నిచోట్లా ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పూర్తయ్యేవరకు మెడికల్ కిట్‌తో ఒక ఏఎన్ఏం అక్కడ విధుల్లో ఉంటారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆచుట్టుపక్కల గల జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తామన్న నమ్మకం ఉంది. మారిన సిలబస్, పరీక్షా విధానంపై విద్యా సంవత్సరం మొదటి నుంచీ విద్యార్థులకు అవగాహన కల్పించాం. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులూ ఇవి పాటించండి పరీక్షకు ముందు రోజు కేంద్రాన్ని ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది.పరీక్ష కేంద్రానికిఅరగంట ముందే చేరుకోవాలి. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహా రం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. ఒకవేళ హాల్‌టికెట్ పోగొట్టుకున్నా, ఫీజులు చెల్లిం చలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www. bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునితో సంతకం చేయించుకుని విద్యార్థి పరీక్షలకు హాజరుకావచ్చు. ప్రశాంతంగా రాయండి: కలెక్టర్ పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురికావద్దని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని హైదరాబాద్ కలెక్టర్ కె. నిర్మల సూచించారు. ఈ పరీక్షలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. పరీక్ష సమయానికంటే అరగంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్ అధికారులు, విధుల నిర్వహణకు నియమించిన సిబ్బంది మినహా ఇతరులను అనుమతించకూడదని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. -
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు
జిల్లాలో 52,296 మంది విద్యార్థులు బాలురు 26,369 - బాలికలు 25,927 మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వరకు పరీక్షలు 86 సిట్టింగ్ స్క్వాడ్లు, 144 సెక్షన్ అమలు 250 పరీక్షా కేంద్రాలు, 55 స్టోరేజీ సెంటర్లు ఏలూరు సిటీ :పాఠశాల విద్యలో విద్యార్థి భవితకు మలుపుగా భావించే పదోతరగతి పరీక్షలకు ఒకవైపు విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తుండగా, మరోవైపు విద్యార్థులు పరీక్షల్లో తమ సత్తా చాటుకునేందుకు సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. ఇక పదోతరగతి పబ్లిక్ పరీక్షలను పక్కాగా, పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు చెప్పారు. మంగళవారం ఏలూరులోని డీఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్షల నిర్వహణ వివరాలు వెల్లడించారు. ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మార్చి 26నుంచి ఏప్రిల్ 11వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలో 52,296 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పక్కా ఏర్పాట్లు చేశాం టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు డీఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించామని, సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూయించివేస్తామని తెలిపారు. మరుగుదొడ్లు ఏర్పాటుతోపాటు ప్రతి గది వద్ద మట్టికుండతో తాగునీరు సౌకర్యం, ప్రథమ చికిత్సా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా చర్యలు చేపట్టాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరేలా ఆర్టీసీ బస్ సర్వీసులను ఎక్కువగా ఏర్పాటు చేశారు 250 పరీక్షా కేంద్రాలు జిల్లాలో పది పరీక్షలు రాసే విద్యార్థులు 52, 296మంది హాజరవుతారు. దీనిలో బాలురు 26, 369మంది, బాలికలు 25, 927మంది పరీక్షలు రాస్తారు. రెగ్యులర్ విద్యార్థులు 48664మందిలో బాలురు 23996మంది, బాలికలు 24668మంది ఉండగా, ప్రైవేటు విద్యార్థులు 3632మందిలో బాలురు 2373మంది, 1259మంది బాలికలు ఉన్నారు. జిల్లాలో 250 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది అదనంగా మొగల్తూరు మండలం తూర్పుకాలనీ, కొవ్వూరు మండలం దుద్దుకూరు, చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 235పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఉండగా, 15కేంద్రాలకు సమీప పాఠశాలల నుంచి డెస్క్‌లు తీసుకువచ్చి ఏర్పాటు చేస్తారు. ఆరు సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు, వాటిలో జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి, తూర్పుతాళ్ళ, దుద్దుకూరు, యర్రగుంటపల్లి ఉన్నాయి. ప్రశ్నాపత్రాలను 55స్టోరేజీ పాయింట్లలో భద్రపరిచారు. ప్రశ్నాపత్రాల పంపిణీ, భద్రతకు 110మంది కస్టోడియన్లను నియమించారు. పరీక్షల్లో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఈసారి ఏకంగా 86సిట్టింగ్ స్వ్కాడ్లు ఏర్పాటు చేశారు. 250మంది చీఫ్ సూపరింటిండెంట్లు, 250మంది డిపార్టుమెంటల్ అధికారులు, 16మంది అసిస్టెంట్ డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు. -
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
జిల్లాలో 81 కేంద్రాల్లో గురువారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షను 65,256 మంది రాయాల్సి ఉండగా 560 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తప్పించారు.భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షలు 81 కేంద్రాలలో గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగుపేపర్-1 పరీక్షకు 65,256 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 560 మంది గైర్హాజరయ్యారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశామని, విధులను సక్రమంగా నిర్వహించని ఇద్దరు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తప్పించామని డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ రాదని, ఇన్విజిలేటర్లు విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు. ‘ఫోన్‌కాల్‌తో బెంచీ’లకు స్పందన పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో నేషనల్ మెంటల్ హెల్త్ మూవ్మెంట్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించిందని ఆ సంస్థ క న్వీనర్ చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. అడ్డతీగల నుంచి అభ్యర్థన రాగానే హుటాహుటిన 25 బెంచీలు పంపినట్టు తెలిపారు. ఎక్కడైనా అసౌకర్యం ఉంటే 98481 83838 నంబర్లో సంప్రదించాలని సూచించారు.