నో డీబార్
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యూరుు. మొత్తం 63,128 మంది విద్యార్థులకు గాను 62,785 మంది విద్యార్థులు హాజరయ్యారు. 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలిరోజు జరిగిన పరీక్షలో మాస్‌కాపీయింగ్ పాల్పడినవిద్యార్థులు ఎవరూ లేకపోవడం విశేషం. జిల్లాలో 274 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా విద్యాధికారి 11 కేంద్రాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 85 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షను పర్యవేక్షించారు.
మారిన సెలబస్‌లో పరీక్ష రాస్తున్న దృష్ట్యా అరగంట ముందే కేంద్రంలోని అనుమతిస్తారని, 15 నిమిషాలు ప్రశ్నాపత్రానికి సమయం ఇస్తారని ప్రకటించడంతో విద్యార్థులు ఉదయం 8గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రావడంతో అంతటా కోలాహలం కనిపించింది. బెస్టాఫ్ లక్, మంచిగా రాయు, టెన్షన్ పడకు, మొదటగా వచ్చినవి రాయు... అంటూ తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వారిని ఆశీర్వదించి పరీక్ష హాల్‌లోకి పంపించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. రాష్ట్ర పరిశీలకులు లక్ష్యారెడ్డి, జిల్లా విద్యాధికారి లింగయ్య పరీక్షల తీరును పర్యవేక్షించారు.
అరకొర వసతులతో ఇబ్బందులు
పది పరీక్షలను పక డ్బందీగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకొన్న జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ముందే ఏర్పాట్లను పూర్తి చేశాం... ఎక్కడా అసౌకర్యాలు లేవని చెప్పగా... జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అరకొర వసతుల నడుమ పరీక్షలను రాశారు. రామగుండం మండలంలోని పలు సెంటర్లలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు సరిపడే డెస్క్‌లను సమకూర్చలేకపోయారు.
మంథని డివిజన్‌లోని పలు కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయడానికి బెంచీలు లేక నేలపై కూర్చుని రాశారు. జగిత్యాలలో సైతం అసౌకర్యాలతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కథలాపూర్ మండలంలోని ఓ పరీక్ష కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హల్‌చల్ చేశాయి. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్‌లతో పాటు సకల సౌకర్యాలు కల్పించడం విమర్శలకు తావిచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు సెంటర్లలో విద్యార్థులకు అసౌకర్యాలు తప్పలేదు.
ఎన్టీపీసీ జ్యోతినగర్‌కు చెందిన యమున అనే విద్యార్థిని భారమైన హృదయంతో పరీక్ష రాసింది. అనారోగ్యంతో గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తండ్రి పీఠాపురం శంకర్(45) బు దవారం మృతి చెందాడు. తండ్రి మృతదేహం మా ర్చురీలో ఉండగా, యమున దుఃఖాన్ని దిగమింగుం టూ తెలుగు పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరై కన్నీటిపర్యంతమైంది.
తొలి రోజు ప్రశాంతం
Published Thu, Mar 26 2015 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM
Advertisement
Advertisement