25 వేల మందికి పాదరక్షలు | 25,000 Students in Rajasthan Will Have Shoes Before Republic Day. All Thanks to This Collector | Sakshi
Sakshi News home page

25 వేల మందికి పాదరక్షలు

Published Sat, Jan 23 2016 9:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

25 వేల మందికి పాదరక్షలు

25 వేల మందికి పాదరక్షలు

జితేంద్ర కుమార్ సోని.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా కలెక్టర్. ఎప్పటిలాగే తన అధికార వాహనంలో కార్యాలయానికి బయలు దేరారు.

ఆ కలెక్టర్ కృషి..!
 
రాజస్థాన్ : జితేంద్ర కుమార్ సోని.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా కలెక్టర్. ఎప్పటిలాగే తన అధికార వాహనంలో కార్యాలయానికి బయలు దేరారు. మార్గమధ్యంలో బడికి వెళ్తోన్న ముగ్గురు చిన్నారులను చూశారు. పుస్తకాల బ్యాగులు మోసుకుంటూ స్కూలు దిశగా పరుగులు తీస్తున్నారు. కలెక్టర్ ఎంతగానో ఆనందించారు. అయితే, అప్పటికే ఆయన కళ్లు మరో విషయాన్ని గమనిస్తున్నాయి. ఆ ముగ్గురి పాదాలకూ పాదరక్షలు లేవు. చలికాలం.. అందులోనూ వణికించే డిసెంబర్ రోజులు. ఆ చిన్నారులు మెండిపాదాలతో ఎలా స్కూలుకు వెళ్లగలుగుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. మనసులో ఎన్నో ఆలోచనలు, పేదరిక బాల్యపు జ్ఞాపకాలు! వెంటనే కారు దిగారు. తన దగ్గరున్న డబ్బుతో ముగ్గురినీ బజారుకి తీసుకెళ్లి బూట్లు కొన్నారు.
 
అక్కడితో ఆ పూటకి జితేంద్ర మనసు సంతృప్తి చెందింది. కానీ, అతడి కంటికి కనిపించని చిన్నారుల పరిస్థితేంటి..? అందుకే, జితేంద్ర అక్కడితో ఆగిపోలేదు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడి టీచర్లను కలిసి, ఎంతమంది షూ లేకుండా పాఠశాలకు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో కొందరు చిన్నారులున్నారని తెలియడంతో తిరిగి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారుల నుంచి సమాచారం సేకరించారు. దాని ప్రకారం జిల్లాలోని 2,500 పాఠశాలల్లో సగటున పదిమంది చొప్పున పాదరక్షలు కొనుక్కోలేనివారున్నారని గ్రహించారు.
 వెంటనే ‘చరణ్ పాదుకా యోజనా’ అనే కొత్త స్కీమును ప్రవేశపెట్టారు. నిరుపేద విద్యార్థులకు పాదరక్షలు సమకూర్చడమే దీని ఉద్దేశం. అయితే, నిధుల కొరత వేధించింది. వెంటనే దాతల సాయం కోరారు. ఈ పథకం గురించి తెలుసుకున్న ప్రజలు ప్రతి రోజూ కలెక్టరేట్‌కు వస్తూ తమకు తోచినంత ఇచ్చి వెళ్తున్నారు. దీంతో తన జిల్లాలోని 25 వేల మంది చిన్నారులకు షూస్ కొనడానికి సరిపడా మొత్తం ఖాతాలో చేరింది. ఈ గణతంత్ర దినోత్సవంలోగా పాదరక్షలను వారికి అందజేయాలని కలెక్టర్ ప్రణాళికలు రచిస్తున్నారు.
 
 ‘‘సాధారణ, నాన్ బ్రాండెడ్ స్కూల్ షూ మార్కెట్లో రూ.200 నుంచి 300 మధ్యలో లభిస్తోంది. దీంతో నా ఆలోచన సాధ్యమే అని అర్థమైంది. ప్రజలనే దానం చేయండంటూ అభ్యర్థించా. వారిచ్చిన నిధులే ఈ పథకానికి ఊపిరి. ఏటా బూట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు కలెక్టర్ జితేంద్ర. పేదరికంలో మగ్గిన తన బాల్యం ఇప్పటికీ గుర్తుందనీ, తండ్రి ఎంతో కష్టపడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చారనీ చెప్పారు. కలెక్టర్‌గారిది ఎంత మంచి మనసో కదా!!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement