గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలం పటగ్నిపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.