విశాఖ జిల్లా పోలీసులు 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లా పోలీసులు 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరు మండలం జల్లిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో తరలించటానికి సిద్ధంగా ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యప్రకాశ్ తెలిపారు.