కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలి ఆనకట్టను రిజర్వాయర్‌గా నిర్మించాలని కోరుతూ నవంబర్ నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్ రెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్:
కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలి ఆనకట్టను రిజర్వాయర్‌గా నిర్మించాలని కోరుతూ నవంబర్ నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్ రెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజోలి జలాశయం నిర్మిస్తే లక్ష ఎకరాలకు నీటిని అందించవచ్చన్నారు. పట్టిసీమ పోలవరం పేరుతో నిధులన్నీ ఒకే ప్రాంతంలో ఖర్చు పెట్టడం దారుణమన్నారు. రాయలసీమలో రైతుల వలసలు, ఆత్మహత్యల నుంచి విముక్తి పొందాలంటే ప్రాజెక్టులన్ని పూర్తి చేయాలన్నారు. న వంబరు 1 నుంచి 10 వరకు సంతకాల సేకరణ, 11 నుంచి 15 వరకు స్థానిక సంస్థలు, నీటి సంఘాల తీర్మానాలు, వినతులు, 16 నుంచి మైదుకూరులో సామూహిక నిరాహారదీ„ý లు చేపడుతున్నట్లు తెలిపారు.