ముగిసిన ఆలిండియా త్రోబాల్ పోటీలు
ముగిసిన ఆలిండియా త్రోబాల్ పోటీలు
Published Sun, Aug 28 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
– మహిళల విజేత తమిళనాడు, రన్నర్స్ ఢిల్లీ
– పురుషుల విజేత ఢిల్లీ, రన్నర్స్ ఆంధ్రప్రదేశ్
– 3వ స్థానంలో మహిళల్లో కర్ణాటక, పురుషుల్లో హర్యానా
కల్లూరు : కర్నూలులోని డీఎస్‌ఏ అవుట్‌డోర్ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగిన ఆలిండియా మహిళల, పురుషుల త్రోబాల్ ఫెడరేషన్ కప్ పోటీలు ఆదివారం ముగిశాయి. మహిళల విభాగంలో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో తమిళనాడు, కర్ణాటక జట్లు పోటీపడ్డాయి. 15–11, 15–13 పాయింట్ల తేడాతో తమిళనాడు జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ హర్యానా, ఢిల్లీ జట్ల మధ్య జరగ్గా 15–7, 15–12 పాయింట్ల తేడాతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ, తమిళనాడు జట్లు పోటీపడగా 15–7, 15–5 పాయింట్ల తేడాతో సునాయసంగా తమిళనాడు జట్టు విజయకేతనం ఎగురవేసింది. సెమీఫైనల్స్‌లో ఓడిన కర్ణాటక, హర్యానా జట్ల మధ్య 3వ స్థానానికి జరిగిన పోటీలో 15–9, 15–10 పాయింట్ల తేడాతో హర్యానా జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో మొదటి సెమీఫైనల్‌లో ఢిల్లీ, హర్యానా జట్లు పోటీపడగా 15–13, 15–11 పాయింట్ల తేడాతో ఢిల్లీ జట్టు, రెండవ సెమీఫైనల్‌లో తమిళనాడు, ఏపీ జట్లు పోటీపడగా 15–13, 15–13 పాయింట్ల తేడాతో ఏపీ జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢీల్లీ, ఏపీ జట్ల మధ్య మూడు సెట్లలో పోటీ జరిగింది. 15–10, 6–15, 15–8 పాయింట్ల తేడాతో ఢిల్లీ జట్టు గెలుపొందింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హర్యానా, తమిళనాడు జట్లు పోటీపడగా 15–9, 15–9 పాయింట్ల తేడాతో తమిళనాడు జట్టు విజయ కేతనం ఎగురవేసింది. పారిశ్రామికవేత్త టీజీ శివరాజప్ప, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆలిండియా ఫెడరేషన్ చైర్మన్ కమల్‌గోస్వామి, ప్రధాన కార్యదర్శి నరేస్‌మన్, రాష్ట్ర సంఘం కార్యదర్శి సులోచన, జిల్లా ఒలంపిక్‌సంఘం కార్యదర్శి రామాంజనేయులు, పోటీల నిర్వాహక కార్యదర్శి కిరణ్‌కుమార్, సెపక్‌తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, నిర్వాహకులు కమల్‌బాషా పాల్గొన్నారు.
Advertisement
Advertisement