♦ రవాణా శాఖలో మార్పులు
♦ ఆగస్టు 2 నుంచి అమలు
♦ జిల్లా ఉప రవాణా కమిషనర్ రమేశ్ వెల్లడి
సంగారెడ్డి టౌన్: రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలు ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని జిల్లా ఉప రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో స్లాట్ పొందాలని సూచించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న నిర్దేశిత సమయంలో కార్యాలయానికి రావాలన్నారు. www.transport.telangana.gov.in వెబ్‌సైట్‌లో కావాలసిన సేవలకు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కంప్యూటర్ ఒక అప్లికేషన్ నెంబరు కేటాయింస్తుందని వివరించారు. దాని సమాచారం సదరు వ్యక్తి మోబైల్ నెంబరుకు ఎస్‌ఎంఎస్ ద్వారా వస్తుందన్నారు.