transport commissioner
-
ఆర్టీసీ సమ్మె : అధ్యయన కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ఈడీ అధికారుల కమిటీ బస్ భవన్లో బుధవారం సమావేశమైంది. సీఎం ఆదేశాలతో కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిలో భాగంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరుపనున్నారు. రెండు రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదిక సారాంశాన్ని 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు వివరించనుంది. (చదవండి : కార్మికుల డిమాండ్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు) ఇక విలీనం మినహా మిగతా 21 డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో.. చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ‘విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొనడం గమనార్హం. సమ్మెలో భాగంగా బుధవారం దిల్సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’అని వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 19వ రోజుకు చేరింది. -
వారిపై చర్యలు తీసుకోండి
అమరావతి బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి దూషించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలకు ఆదేశించాలని కూడా ఆ ఫిర్యాదులో కోరారు. కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.సుబ్రమణ్యం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లుగా తప్పుడు నివేదికలు ఇవ్వనందునే రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ అధికారుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని, వారికి తగిన రక్షణ కల్పించి ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన కోరారు. -
గొడవ చేసిన వారు క్షమాపణలు చెప్పారు
-
'చంద్రబాబు అండతోనే దాడులు'
విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు.. రవాణాశాఖ కమిషనర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక విధానం, ప్రతిపక్షానికి మరో విధానం కొనసాగుతుందని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి అన్నారు. బస్సు ప్రమాదం సందర్భంగా అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టిన అధికారులు.. ఎయిర్‌పోర్టులో జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టిస్తే కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇన్ని వందల అక్రమ బస్సులు ఎలా తిరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'కమిషనర్ తాను నోరు తెరిస్తే చాలా అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఆ నిజాలేంటో చెప్పాలి. ఏ ఒత్తిడిలతో వాస్తవాలను అణచివేస్తున్నారో చెప్పాలి' అని పార్థసారథి అన్నారు. తమను తాము కాపాడుకోవడానికి అధికారులు దండం పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్న ఆయన.. వనజాక్షిపై దాడి చేసిన వారిని వెనుకోసుకొచ్చిన ముఖ్యమంత్రి రవాణా శాఖ కమిషనర్‌పై దాడి చేసినవారిని కూడా వెనుకేసుకొస్తారా లేక చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పంచాయితీలు చేసే స్థితికి చంద్రబాబు దిగజారారన్నారు. ఎమ్మార్వో వనజాక్షి, టూరిజం సిబ్బందిపై దాడి ఘటనలో చర్యలు లేవని గుర్తు చేశారు. దాడికి పాల్పడిన కేశినేని నాని, బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
'చంద్రబాబు అండతోనే దాడులు'
-
హైవేలో ప్రమాదాల నివారణకు కృషి
► అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి.శ్రీనివాస్ మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) : జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు. ప్రమాదాలకు గల కారణాలు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వెల్లడించారు. శనివారం మాధవధారలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా మూడు జిల్లాల పరిధిలో గల హైవేలలో పరిశోధన జరుపుతున్నారు. విశాఖపట్నం డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నేతృత్వంలో పరిశోధన జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో 114, విజయనగరంలో 33, శ్రీకాకుళం జిల్లాలో 180 కిలో మీటర్ల హైవే కలిగి ఉంది. మూడు జిల్లాల పరిధిలో ప్రమాదకర ప్రాంతాలు, అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న అంశాలు, రోడ్ల డిజైనింగ్, కల్వర్టుల నిర్మాణం, స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్ లైట్లు, తదితర అంశాలపై పరిశోధన జరుపుతున్నారు. హైవే నిబంధనల ప్రకారం రోడ్ల నిర్మాణం ఎలా ఉందో పరిశీలించారు. బుధవారం నాటికి సర్వే పూర్తిచేసి డీటీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు శ్రీనివాస్ స్పష్టం చేశారు. నివేదికలో ఆయా అంశాలు, సూచనలకు తగ్గట్టుగా ప్రభుత్వం చొరవ చూపనుందని ప్రకటించారు. ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ పరంగా హైవేలలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు, విశాఖ ఆర్టీవోలు ఎ.హెచ్.ఖాన్, ఐ.శివప్రసాద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రవాణా అధికారులు, గీతం కళాశాల ప్రొఫెసర్ ముకుంద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రొఫెసర్లు రమేషన్‌రాజు, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అన్ని సేవలూ..ఆన్లైన్లోనే
♦ రవాణా శాఖలో మార్పులు ♦ ఆగస్టు 2 నుంచి అమలు ♦ జిల్లా ఉప రవాణా కమిషనర్ రమేశ్ వెల్లడి సంగారెడ్డి టౌన్: రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలు ఆగస్టు 2 నుంచి ఆన్లైన్లోనే నిర్వహిస్తామని జిల్లా ఉప రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో స్లాట్ పొందాలని సూచించారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసుకున్న నిర్దేశిత సమయంలో కార్యాలయానికి రావాలన్నారు. www.transport.telangana.gov.in వెబ్సైట్లో కావాలసిన సేవలకు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కంప్యూటర్ ఒక అప్లికేషన్ నెంబరు కేటాయింస్తుందని వివరించారు. దాని సమాచారం సదరు వ్యక్తి మోబైల్ నెంబరుకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుందన్నారు. -
డీటీసీ అవినీతిలో ‘అధికార’ వాటా
♦ ఏపీ అధికార పార్టీ నేతల అండతోనే మోహన్ అవినీతి ♦ మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆదిమూలం మోహన్ అవినీతిలో ఏపీ అధికార పార్టీ నేతలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ అధికార పార్టీ నేతల అండతోనే మోహన్ అవినీతి వ్యవహారాలు సాగించినట్లు రవాణా శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది రవాణా శాఖ బదిలీల సమయంలో మోహన్‌కు తూర్పు గోదావరి జిల్లాలో డీటీసీగా పోస్టింగ్ ఇప్పించేందుకు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నత స్థాయిలో పట్టుబట్టి మరీ మోహన్‌కు పోస్టింగ్ ఇప్పించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి రవాణా శాఖ పోస్టింగుల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. 8మంది రవాణా అధికారులకు పోస్టింగుల కోసం రూ.5 కోట్లు వసూలు చేశారు. మోహన్‌కు డీటీసీగా పోస్టింగ్ ఇప్పించినందుకు ప్రతిఫలంగా ఏపీ అధికార పార్టీ నేతలకు, పార్టీ కార్యక్రమాలకు ఇతోధికంగా సాయమందించారన్న ఆరోపణలున్నాయి. మోహన్ అవినీతిలో పలువురు ఎమ్మెల్యేలు వాటాలు పొందినట్లు తెలుస్తోంది. చివరకు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా లో పలు విద్యాసంస్థలు, అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు, సెటిల్మెంట్లలోనూ అధికార పార్టీ నేతలకు వాటాలున్నాయి. రవాణా శాఖ బదిలీల్లోనూ మోహన్ పైరవీలు మోహన్ పనిచేసిన జిల్లాల్లో రవాణా శాఖ బదిలీలు, పదోన్నతులలో పెద్ద ఎత్తున పైరవీలు సాగించినట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎంవీఐ పోస్టుకు రూ.15 నుంచి రూ.20 లక్షలు, ఏఎంవీఐ పదోన్నతులకు భారీగా సొంత శాఖ అధికారుల నుంచే రూ.కోట్లలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోస్టింగులు, గతంలో రవాణాశాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని అడ్డుపెట్టుకుని పదోన్నతుల్లో మోహన్ తన దందా సాగించారు. సదరు ఉన్నతాధికారి అప్పట్లో విమానాశ్రయంలో భారీ నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏసీబీ దాడుల్లో చిక్కిన రవాణా అధికారులకు పోస్టింగులిప్పించడంలోనూ, విచారణను ఉపసంహరించడంలోనూ ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన మోహన్ ఇప్పుడు తనపై కేసునుంచి ఏ విధంగా బయటపడతారో.. అన్న వ్యాఖ్యలు సొంత శాఖ అధికారులు వ్యక్తం చేయడం గమనార్హం. డీటీసీ మోహన్ అవినీతి స్టైల్ ఇదీ.. చెక్‌పోస్టుల్లో టేబుల్ కలెక్షన్ల పేరిట రవాణా శాఖ అధికారులు ప్రతి రోజూ రూ.లక్షల్లో బహిరంగంగానే ముడుపులు స్వీకరిస్తారు. ఈ కలెక్షన్లన్నీ తనకే చెందాలని అధికారులను బెదిరించడం మోహన్ నైజం. నెల్లూరు జిల్లాలో పనిచేసిన సమయంలో టార్గెట్లు విధించి మరీ వసూళ్లు చేసేవారని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాకినాడ పోర్టు నుంచి రవాణా జరిగే సరుకు లారీల నుంచి, లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంకర్ల అసోసియేషన్లతో సెటిల్మెంట్లు రివాజుగా మారాయి. ఏదైనా వాహనం పట్టుబడితే జరిమానా కట్టాలి. ఈ జరిమానా మొత్తాన్ని రెండుగా విభజించి వాహనదారుల నుంచి వసూలు చేయడం అలవాటని తెలుస్తోంది. -
రవాణా అధికారుల రిలీవ్‌కు రెండో జీఓ జారీ
ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఎస్ఏవీ ప్రసాదరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వి.సుందర్‌లు ఉన్న ఫళంగా రిలీవ్ కావాల్సిందేనని ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసింది. ఈ నెల 5న వీరిరువురు బదిలీలపై ప్రభుత్వం జీవో నెంబరు 5 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 6న రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం బదిలీలు నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, సీఎం పేషీ ఆగ్రహంతో ఉన్న వైనంపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సర్కారు వెంటనే అధికారులిద్దరూ రిలీవ్ కావాల్సిందేనని రెండో జీవో జారీ చేసింది. దీంతో మంత్రి శిద్ధా, సీఎం పేషీ అధికారి ఒకరు తమ పంతం నెగ్గించుకున్నట్లయింది. రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీగా పనిచేస్తున్న ప్రసాదరావు తన బాధ్యతల్ని అదనపు కమిషనర్‌కు అప్పగించి వెంటనే రిలీవ్ కావాలని, విజయవాడలో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడలో పనిచేస్తున్న డీటీసీ సుందర్ అనంతపురంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ ఉత్తర్వులిచ్చారు. -
సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి
నగరంపాలెం(గుంటూరు) : ద్విచక్రవాహనంపై సురక్షితంగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఉప రవాణా కమిషనరు రాజారత్నం అన్నారు. రవాణాశాఖ ఆధ్యర్యంలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వాడకం పై నిర్వహించిన అవగాహన ర్యాలీని మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వాహనప్రమాదంలో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారే 80 శాతం ఉన్నారన్నారు. రవాణా కమిషనరు ఆదేశానుసారం నవంబరు మెదటి తేదీ నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నరు. రవాణా శాఖ వాహనదారుల భద్రత కోసం రూపొందించిన నిబంధనలు నిర్లక్ష్యంగా పాటించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ డీఎస్పీ కండె శ్రీనివాసులు మాట్లాడుతూ జరిమానాలకు భయపడి కాకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండేదుకు హెల్మెట్ వాడాలన్నారు. ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రామస్వామి, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, సుధాకరరెడ్డి తదితరులు వంద వాహనాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. -
సెలవు రోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్‌లు?
సాక్షి, సిటీబ్యూరో: సెలవు రోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్‌లు జారీ చేసేందుకు ఆర్టీఏ కసరత్తు చేస్తోంది. తద్వారా ఉద్యోగులు, నిత్యం బిజీగా ఉండేవారికి ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగులు డ్రైవింగ్ లెసైన్సు తీసుకోవాలంటే రెండు సార్లు ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ పైఅధికారుల అనుమతి తీసుకొని గంట, రెండు గంటల్లో ఆ ప్రక్రియను ముగించుకోవాలనుకొంటే ఏ మాత్రం సాధ్యం కాదు. ఖచ్చితంగా సెలవుపెట్టాల్సిందే. ఈకారణంగా చాలామంది సకాలంలో డ్రైవింగ్ లెసైన్సులు తీసుకోలేకపోతున్నారు. కొత్త వాహనం కొనుక్కొని నెలలు గడిచినప్పటికీ తీరిక లభించని కారణంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తిరిగే వాళ్లు కూడా ఉన్నారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు రవాణాశాఖ సెలవురోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఇదే అంశాన్ని శనివారం అధికారుల ముందు ప్రతిపాదించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు సెలవుల్లోనూ డ్రైవింగ్ లెసైన్సులు, ఇతర పౌరసేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అంశంపై సన్నాహాలు మొదలెట్టారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నగరంలోని వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ రంగాల్లో పని చేసే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరమవుతుంది. భర్తీ కాకుండా మిగిలిపోతున్న స్లాట్లు.... డ్రైవింగ్ లెసైన్సుల జారీలో ఆర్టీఏ కొంతకాలంగా ఆన్లైన్ సేవలను అమలు చేస్తోంది. వాహనదారులు మొదట లెర్నింగ్ లెసైన్సు తీసుకొని ఆ తరువాత ఆరు నెలల్లోపు ఎప్పుడైనా సరే డ్రైవింగ్ లెసైన్సు తీసుకోవచ్చు. ఇందుకోసం ఆన్లై న్లో లెర్నింగ్ లెసైన్సు కోసం ఒకసారి, శాశ్వత డ్రైవింగ్ లెసైన్సు కోసం మరోసారి స్లాట్ నమోదు చేసుకోవలసి ఉంటుంది. అలా నమోదు చేసుకొన్నవాళ్లకు గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో, నాలుగు డ్రైవింగ్టెస్ట్ ట్రాక్‌లలో పరీక్షలు నిర్వహించి లెసైన్సులు అందజేస్తారు. ఈ రెండు కేటగిరీలలో ప్రతి రోజు 1000 నుంచి 1500 మంది పరీక్షలకు హాజరవుతారు. అయినప్పటికీ పలు ఆర్టీఏ కార్యాలయాల్లో స్లాట్లు పూర్తిగా భర్తీ కావడం లేదు. కొన్ని మిగిలిపోతున్నాయి.అంటే ఉద్యోగరీత్యా తీరిక లేకపోవడం వల్ల చాలా మంది స్లాట్లు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నారు. వీకెండ్స్‌లో,రెండో శనివారం, ఆదివారం వంటి సెలవు దినాల్లో కూడా ఆర్టీఏ పౌరసేవలను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం వల్ల చాలా మంది సకాలంలో డ్రైవింగ్ లెసైన్సులు తీసుకోగలుతారని, వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా పెరుగుతాయని రవాణా కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఎంవీఐలు, ఆర్టీఓలు, ఇతర సిబ్బందితో సమాలోచనలు జరపాల్సిందిగా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. సెలవు రోజుల్లో పని చేసే వారు ఇతర పనిదినాల్లో వీక్లీ ఆఫ్ తీసుకొనే అవకాశం ఉంటుంది. -
ఇక డ్రైవింగ్ లెసైన్సులకు ‘ఆధార్'
అరండల్‌పేట(గుంటూరు): జిల్లాలో రవాణా లెసైన్సుదారులు తమ లెసైన్సులకు ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ వి.సుందర్ కోరారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోటారు వాహన రికార్డుల్లోనూ, డ్రైవింగ్ లెసైన్సు రికార్డుల్లోనూ ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియకు కాలపరిమితి లేదని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. జిల్లాలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలలోనూ అనుసంధానం చేసుకొనే వీలు ఉందన్నారు. ఇంటి నుంచే ఇంటర్నెట్ ద్వారా కూడా లెసైన్సుదారులు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చన్నారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీట్రాన్స్‌పోర్ట్.ఓఆర్జీ.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్‌చేసి ఆధార్‌నంబర్ ఎంట్రీ బటన్ నొక్కితే అనుసంధానానికి చేయాల్సిన వివరాలు వస్తాయని, వాటి ఆధారంగా ఆధార్‌తో లెసైన్సులను అనుసంధానం చేసుకొవచ్చని చెప్పారు. 15 సంవత్సరాల కాలపరిమితి గల లెసైన్సుదారులకు మాత్రం కొత్త నిబంధన ప్రకారం తమ మోటారు వాహన రికార్డు, డ్రైవింగ్ లెసైన్సు రికార్డులతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైతే రవాణాశాఖ కార్యాలయంలో వారి రికార్డులకు తగిన భద్రత ఉంటుందని చెప్పారు. దీనిపై మారుమూల గ్రామాల్లో సైతం విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో ఎల్ఎల్/డీఎల్ పరీక్షా సమయం బుక్ చేసుకొనేటప్పుడు, డీలర్ దగ్గర కొత్త వాహనం కొనే సమయంలో, ఏదైనా లావాదేవీల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నమోదు చేసుకోవాలని సూచించారు. త్వరలో మీ సేవ ద్వారా కూడా ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రాంతీయ రవాణా అధికారి బి.చందర్, పరిపాలనాధికారి కె.శ్రీధర్ పాల్గొన్నారు. -
మంత్రా... మజాకా
సాక్షి ప్రతినిధి, కడప: ట్రాన్సుపోర్టు శాఖలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కోరుకున్నంత అప్పగిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులిస్తున్నారు. ఆర్టీఓ అవసరం ఉన్నచోట పోస్టింగ్ ఇవ్వకపోగా డిప్యూటీ c ఉన్న చోటే అదనంగా ఆర్టీఓను నియమిస్తూ సరికొత్తగా ఆదేశించారు. ఇందుకు ఓఎమ్మెల్యే సంపూర్ణ సహకారం అందించారు. ఉన్న పోస్టులో ఎలాగైనా కొనసాగాలనే లక్ష్యంతో ఓ అధికారి లకారాలను సమర్పించుకుని పనిచక్కబెట్టుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపలో డీటీసీ ప్రొద్దుటూరులో ఆర్టీఓ కార్యాలయం ఉన్నాయి. ప్రొద్దుటూరు ఆర్టీఓ ఆనందరాజు నవంబర్ 31న పదవీవిరమణ చేశారు. ఆస్థానంలో రవీంద్రకుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్టీఓ పోస్టు కీలకం. ప్రొద్దుటూరుతోబాటు బద్వేల్, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాలు ఆర్టీఓ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ వార్షిక ఆదాయం రూ.6.5కోట్లు పైబడి ఉంది. అలాంటి కీలకమైన కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్థానాన్ని భర్తీ చేయాల్సిన యంత్రాంగం మిన్నకుండిపోతోంది. అందుకు కారణం రాజకీయ పైరవీలేనని పలువురు పేర్కొంటున్నారు. మనోడే కదిలించొద్దు.... ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి ఆర్టీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవీంద్రకుమార్‌ను తొలగించవద్దని రాజకీయ పైరవీలు ముమ్మరం అయినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో బాటు, మరో ఎమ్మెల్యే సంబంధిత మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇటీవలే అదనపు బాధ్యతలు తీసుకున్నారు,. ఎలాగైనా కదిలించవద్దు అంటూ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కేంద్రంలోని డీటీసీ కార్యాలయంలో ఆర్టీఓ పోస్టును భర్తీ చేసినట్లు సమాచారం. ముందుగా ఖాళీ ఉన్న స్థానాన్ని భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నా ట్రాన్స్పోర్ట్ కమిషనరేట్ కార్యాలయం మంత్రి ఒత్తిడికి తలొగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అస్లాంబాష ఆర్టీఓగా కడపలో నే డు బాధ్యతలు చేపట్టనున్నారు. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునేందుకు, అధికార పార్టీ నేతల మద్దతు కూడగట్టడంలో ప్రొద్దుటూరు అధికారి సఫలం కావడంతో ఈ ఉత్తర్వులు వెలుబడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అధికారపార్టీ నేతలకు లకారాలు సమర్పించుకున్నట్లు సమాచారం. -
రవాణా కమిషనర్ హామీతో బంద్ విరమణ
సాక్షి,సిటీబ్యూరో: రెండురోజులపాటు నిలిచిపోయిన ఆటోలు ఎట్టకేలకు గురువారం సాయంత్రం రోడ్డెక్కాయి. వీరమోత మోగిస్తున్న చలానా రూ.1000 తగ్గించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆటోసంఘాలు కలిసి చేస్తున్న సమ్మెను విరమించారు. దీంతో నానాఇబ్బందులకు గురైన ప్రయాణికులు సమ్మె విరమణతో ఊపిరిపీల్చుకున్నారు. గురువారం సాయంత్రం రవాణాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆటోసంఘాల జేఏసీ ఆటోబంద్ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చలానా మొత్తాన్ని తగ్గించేందుకు సర్కారు సానుకూలంగా ఉందని,రవాణాశాఖ కమిషనర్ అనంతరాము,ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత వారిపై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఐఎఫ్టీయూ నాయకుడు నరేందర్ ‘సాక్షి’తో వెల్లడించారు. అయితే ఈ విరమణ తాత్కాలికం మాత్రమేనని, రవాణా మంత్రి బొత్సతో తాము త్వరలో జరుపనున్న చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. చలానా తగ్గింపు సంతృప్తికరంగా లేకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమం.. కవాడిగూడ: అధిక చలాన్లను మోపే 108 జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే 13 ఆటోయూనియన్ల ఆధ్వర్యంలో జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సీఐటీయూ కార్యదర్శి ఈశ్వర్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 13 ఆటోసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో గురువారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ,ఐఎఫ్టీయూ, టీఏడీజేఏసీ, సీఐ టీయూ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, ఏపీఏడీఎస్, టీఏటీయూ, టీఏడీయూ, టీటీయూసీ, జీహెచ్‌ఏడీసీ, ఆటోఓనర్స్ అసోసియేషన్, పేదప్రజల పార్టీ తరఫున ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ నగరంలో 1.20 లక్షలు ఉన్న ఆటోలకు సరైన స్టాండ్లను ఏర్పాటు చేయలేని సర్కారు ఒకేసారి చలానా మొత్తాన్ని విధించే హక్కులేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో బతికే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వం..అధిక చలానాతో అప్పులపాల్జేస్తోందని ధ్వజమెత్తారు. అంతకుముందు రాంనగర్ చౌరస్తాలో ఐఎఫ్టీయూ,సీఐటీయూల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి 108 జీవో ప్రతులను తగులబెట్టారు. -
రవాణా కమిషనర్ హామీతో బంద్ విరమణ
సాక్షి,సిటీబ్యూరో: రెండురోజులపాటు నిలిచిపోయిన ఆటోలు ఎట్టకేలకు గురువారం సాయంత్రం రోడ్డెక్కాయి. వీరమోత మోగిస్తున్న చలానా రూ.1000 తగ్గించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆటోసంఘాలు కలిసి చేస్తున్న సమ్మెను విరమించారు. దీంతో నానాఇబ్బందులకు గురైన ప్రయాణికులు సమ్మె విరమణతో ఊపిరిపీల్చుకున్నారు. గురువారం సాయంత్రం రవాణాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆటోసంఘాల జేఏసీ ఆటోబంద్ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చలానా మొత్తాన్ని తగ్గించేందుకు సర్కారు సానుకూలంగా ఉందని,రవాణాశాఖ కమిషనర్ అనంతరాము,ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత వారిపై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఐఎఫ్టీయూ నాయకుడు నరేందర్ ‘సాక్షి’తో వెల్లడించారు. అయితే ఈ విరమణ తాత్కాలికం మాత్రమేనని, రవాణా మంత్రి బొత్సతో తాము త్వరలో జరుపనున్న చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. చలానా తగ్గింపు సంతృప్తికరంగా లేకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమం.. కవాడిగూడ: అధిక చలాన్లను మోపే 108 జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే 13 ఆటోయూనియన్ల ఆధ్వర్యంలో జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సీఐటీయూ కార్యదర్శి ఈశ్వర్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 13 ఆటోసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో గురువారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ,ఐఎఫ్టీయూ, టీఏడీజేఏసీ, సీఐ టీయూ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, ఏపీఏడీఎస్, టీఏటీయూ, టీఏడీయూ, టీటీయూసీ, జీహెచ్‌ఏడీసీ, ఆటోఓనర్స్ అసోసియేషన్, పేదప్రజల పార్టీ తరఫున ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ నగరంలో 1.20 లక్షలు ఉన్న ఆటోలకు సరైన స్టాండ్లను ఏర్పాటు చేయలేని సర్కారు ఒకేసారి చలానా మొత్తాన్ని విధించే హక్కులేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో బతికే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వం..అధిక చలానాతో అప్పులపాల్జేస్తోందని ధ్వజమెత్తారు. అంతకుముందు రాంనగర్ చౌరస్తాలో ఐఎఫ్టీయూ,సీఐటీయూల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి 108 జీవో ప్రతులను తగులబెట్టారు.