అమరావతి టు అనంతపూర్‌కు ఆరు లైన్ల రోడ్డు
అమరావతి టు అనంతపూర్‌కు ఆరు లైన్ల రోడ్డు
Published Mon, Nov 28 2016 11:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
శ్రీశైలం: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతి టు అనంతపూర్‌కు ఆరు లైన్ల రోడ్లు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉండేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి మండల, తాలూకా, జిల్లా స్థాయి వరకు.. అక్కడి నుంచి రాజధానికి రోడ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించామన్నారు. అనంతపురం నుంచి అమరావతి వరకు రోడ్లు నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కేవలం 8గంటల వ్యవధిలో రాజధానికి చేరుకునేలా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో కారిడార్లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.
Advertisement