వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాలకు డబ్బు
వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాలకు డబ్బు
Published Fri, Jan 27 2017 11:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– కందుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మార్క్‌ఫెడ్ అధికారులు
పత్తికొండ టౌన్: కందులు అమ్మిన వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మార్క్‌ఫెడ్ రాష్ట్ర డీఓ పవన్‌కుమార్, జిల్లా మేనేజర్ పరిమళజ్యోతి తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులోని కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కర్నూలులో 13, అనంతపురంలో 14, కృష్ణా జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి మూడు నెలలపాటు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.5,050కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కందుల ధర ఎట్టి పరిస్థితుల్లోనూ పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ సెక్రెటరీ రూప్‌కుమార్, కేడీసీఎంఎస్ మేనేజర్ మురళి, సిబ్బంది మల్లికార్జున, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement