రైతు సమస్యలపై సెప్టెంబర్ 27న అనంతపురంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా నిర్వహించనున్నారు.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ధర్నాకు మద్దతు ఇవ్వాలని రైతులకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం అనంతపురంలో వారిరువురు మాట్లాడుతూ... కరువు రైతుల సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని ఆరోపించారు.
తుంగభద్ర ఎగువకాల్వ ఆయుకట్టుకు ప్రతిఏటా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సెప్టెంబర్ 27వ తేదీన అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించనున్నారని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా డబ్బులు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు రెయిన్గన్ల డ్రామా అడుతున్నారని విమర్శించారు.