కొన్ని చట్టాలను సవరించేందుకు మంగళవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మీటింగ్ ముగిసింది.
విజయవాడ: కొన్ని చట్టాలను సవరించేందుకు మంగళవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మీటింగ్ ముగిసింది. ఏపీ ఐడీఈ చట్టం, ఇన్ ఫ్రా అథారిటీ, స్విస్ చాలెంజ్ విధానాల్లో సవరణల కోసం సమావేశమైన కేబినేట్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ఐడీఈలో చట్టాన్ని సవరించేందుకు కేబినేట్ ఆమోదం వేసింది.
రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీలకు ఉన్న అడ్డంకులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనుంది. నకిలీ విత్తనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేబినేట్ నిర్ణయించింది.