Swiss Challenge method
-
స్విస్ ఛాలెంజ్ విధానం రద్దు శుభపరిణామం
-
కోట్లు దండుకోవడమే బాబు లక్ష్యం
► వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపాటు ► కోర్టులు మొట్టికాయలు వేసినా బాబుకు బుద్ధి రావడం లేదు సాక్షి,హైదరాబాద్: న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా సీఎం చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, రూ.లక్షల కోట్లు దండుకోవాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని,కోర్టులు దీన్ని అడ్డుకున్నాయని చెప్పారు. అంబటి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.స్విస్ చాలెంజ్‌లో సింగపూర్ కంపెనీలే పాల్గొనడం ఏమిటని ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ, ఎన్వీఎస్ ఇంజనీర్స్ కంపెనీలు హైకోర్టులో సవాల్ చేస్తే, సింగిల్ జడ్జి 54 పేజీల ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం విలువలకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నం చేసిందని కోర్టు స్పష్టంగా తీర్పు ఇస్తే చంద్రబాబు తన తప్పు తెలుసుకోకపోగా డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లడాన్ని అంబటి ఆక్షేపించారు. న్యాయస్థానాలకు దొరక్కుండా రూ.లక్షల కోట్లు సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారిని బాబు అభివృద్ధి నిరోధకులుగా, ఉన్మాదులుగా పోల్చారన్నారు. మరి హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ని ఎందుకు ఉపసంహరించుకుందని నిలదీశారు. ఇంకా ఏం మాట్లాడారంటే... వాటాల మర్మం ఏమిటో చెప్పాలి ‘‘స్విస్ చాలెంజ్ విధానంలో పెట్టుబడుల మర్మం ఏమిటో సీఎం చంద్రబాబే చెప్పాలి. 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు, సింగపూర్ కంపెనీలు కేవలం రూ.300 కోట్లు పెట్టుబడులుగా పెడుతాయి. ఇందులో సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు 58 శాతం, ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా ఉంటుందనడం ఆశ్చర్యకరం. దోపిడీకి ఇది పరాకాష్ట. దీనికోసమే చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1,691 ఎకరాల్లో జరిగేది రాజధాని నిర్మాణం కానేకాదు, పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. బాబుకు కడుపు మంట ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి యువత, నిరుద్యోగుల నుంచి లభిస్తున్న మద్దతు చూసి చంద్రబాబు కడుపు మండుతోంది. యువభేరిలకు వెళ్లొద్దని బాబు చెబితే వినేవాళ్లు ఎవరూ లేరు. హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకుంటే బాబు మూతి కాలడం ఖాయం. ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేస్తాం స్విచ్ చాలెంజ్‌పై హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా చట్టాలను మార్చి మళ్లీ అదే విధానాన్ని మొండిగా ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు. ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేస్తాం. ప్రజల సొమ్మును కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. ’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం
విజయవాడ: కొన్ని చట్టాలను సవరించేందుకు మంగళవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మీటింగ్ ముగిసింది. ఏపీ ఐడీఈ చట్టం, ఇన్ ఫ్రా అథారిటీ, స్విస్ చాలెంజ్ విధానాల్లో సవరణల కోసం సమావేశమైన కేబినేట్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ఐడీఈలో చట్టాన్ని సవరించేందుకు కేబినేట్ ఆమోదం వేసింది. రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీలకు ఉన్న అడ్డంకులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనుంది. నకిలీ విత్తనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేబినేట్ నిర్ణయించింది. -
స్విస్ ఛాలెంజ్.. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో పాలన ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. సింగపూర్ కంపెనీలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అర్థమవుతోందని బుగ్గన చెప్పారు. సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు పారదర్శకంగా లేవని కోర్టు పేర్కొందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా స్విస్ ఛాలెంజ్‌లో నిబంధనలున్నాయని, సింగపూర్ కంపెనీలను ఇంటి అల్లుడి కంటే ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని బుగ్గన ఆరోపించారు. -
‘చాలెంజ్’కు చుక్కెదురు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తూ వస్తున్న విధానాలు ఎప్పటిలాగే బెడిసికొట్టాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల టెండ ర్లలో ‘స్విస్ చాలెంజ్’ విధానం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సోమ వారం హైదరాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విధానంలో ఏమాత్రం పారదర్శకత ఉండటంలేదు గనుక దాన్ని ప్రోత్సహించవద్దని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నిరుడు సూచించింది. ఈ విధానం నల్లడబ్బు పెరుగుదలకు దోహదపడుతున్నదని దేశంలోని పౌర సమాజ ఉద్యమకారులు చాన్నాళ్లనుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంపై దేశంలోనే కాదు... విదేశాల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వీటన్నిటి పర్యవసానంగానే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్ నేతృత్వంలో 9మందితో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దేశంలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులను పరిశీలించింది. ఆ రంగంలో పనిచేస్తున్న పలువురు ఉన్నత శ్రేణి నిపుణులను సంప్రదించింది. ఆ తర్వాత నిరుడు నవంబర్‌లో సవివరమైన నివేదిక సమర్పించింది. దేశంలో అరడజను రాష్ట్రాలు ఈ విధానం ద్వారా వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల్ని అమలు చేస్తున్నాయి. జాప్యం లేకుండా పనులు పూర్తికావడానికి ఈ విధానం ఉత్తమమైనదని 2009లో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన తర్వాత ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని చాలా ప్రభుత్వాలు అమలు చేయడం ప్రారంభించాయి. అయితే అదే తీర్పులో న్యాయస్థానం కొన్ని సవరణలు కూడా సూచించింది. ముఖ్యంగా ఎంపికైన ప్రాజెక్టుల పర్యవేక్షణకు నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కావా లని అభిప్రాయపడింది. ఈ విధానం ఉత్తమమైనదని సుప్రీంకోర్టు భావించడానికి కొన్ని కారణాలు న్నాయి. సంప్రదాయ విధానంలో ప్రభుత్వం ఒక ప్రాజెక్టును గుర్తించి, దాని నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తుంది. నిర్మాణ వ్యయమెంతో మదింపు వేస్తుంది. టెండర్లు పిలుస్తుంది. అనుభవమూ, సామర్థ్యమూ గల సంస్థ లను గుర్తిస్తుంది. అందులో తక్కువ వ్యయానికి పూర్తి చేస్తామన్న వారిని ఎంపిక చేస్తుంది. అయితే ఈ ప్రక్రియకు సుదీర్ఘకాలం పడుతుంది. సకాలంలో పనులు పూర్తికావు. నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ‘స్విస్ చాలెంజ్’ దీనికి పూర్తిగా భిన్నం. ప్రాజెక్టుకు సంబంధించిన ఆలోచన ఎవరికైనా రావొచ్చు. అలా వచ్చిన సంస్థ నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంది. అందుకయ్యే వ్యయం, సమకూరే ప్రయో జనాలు వగైరాలతో సవివరమైన నివేదిక అందజేస్తుంది. ఉపయోగకర మైనదని ప్రభుత్వం కూడా భావిస్తే దాన్ని ఆమోదిస్తుంది. ఆ సంస్థ సూచించినకంటే తక్కువ వ్యయానికి ఎవరైనా పూర్తిచేస్తామని ముందుకొస్తే అవకాశం ఇస్తామని ప్రకటి స్తుంది. అందుకు వేరే సంస్థ సంసిద్ధత తెలిపితే మొదటి సంస్థను ‘మీరు ఆ ధరకు చేస్తారా...’ అని ప్రశ్నిస్తుంది. దానికి అంగీకరిస్తే వారికే ఇస్తుంది. అది గిట్టుబాటు కాదని వెనక్కు తగ్గితే తక్కువ వ్యయానికి చేస్తామన్న సంస్థకు ప్రాజెక్టు కట్టబెడు తుంది. ఈ విధానంలో ప్రాజెక్టు ఆలోచన మొదలుకొని అనేక అంశాల్లో ప్రభుత్వం పాత్ర తగ్గిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించినవారికి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ఇందులో చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా మొదట్లో అంగీకరించిన ధరకు పూర్తి చేయడం సాధ్యంకాదని సంస్థ మధ్యలో మొండికేస్తే ప్రభుత్వం నిస్స హాయ స్థితిలో పడుతుంది. ఏ కారణం చేతనైనా ప్రభుత్వమే కాంట్రాక్టు రద్దు చేయాలనుకుంటే భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అమరావతి విషయంలో ఈ పరిహారం 150 శాతం వరకూ ఉంది. పారదర్శకతకే చోటుండదు. అసలు ప్రాజెక్టు ఆలోచనే కొత్తది గనుక దాన్ని మదింపు వేయడానికి, ఒక అంచనాకు రావడానికి పోటీ సంస్థలకు సమయం పడుతుంది. ఈలోగా గడువు ముగిసిపోతుంది. పేరుకే ‘చాలెంజ్’ తప్ప మొదట ప్రతిపాదించిన సంస్థే పోటీ లేకుండా దాన్ని తన్నుకుపోతుంది. ఇలాంటి సమస్య లుండబట్టే 2011లో కేంద్రం కొన్ని పరిమితులు విధించింది. తప్పనిసరైతే తప్ప ‘స్విస్‌చాలెంజ్’ వైపు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. విశేషమైన పాలనానుభవం ఉన్నదని తరచు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’ పేరు అలాగే ఉంచి దానికి మరింత భ్రష్ట రూపాన్ని కనిపెట్టారు. సింగపూర్ కన్సార్టియం సంస్థలకు రాజధాని నిర్మాణం కట్టబెట్టాలన్న నిర్ణయం ముందే తీసుకుని ఆ దిశగా పావులు కదిపారు. కన్సా ర్టియంకు దాదాపు రూ. 6,000 కోట్ల విలువైన భూమిని అప్పగించడం మాత్రమే కాదు... ప్రాజెక్టుకు అవసరమైన నీరు రోడ్లు, విద్యుత్ వగైరా సౌకర్యా లన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. కన్సార్టియం పెట్టుబడి ఇందులో కేవలం రూ. 306 కోట్లు. వాస్తవానికి ఆ కంపెనీలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రూ. 300 కోట్ల విలువైన భూముల్ని లెక్కేస్తే వాటి పెట్టుబడి నిజానికి రూ. 6 కోట్లే! ప్రాజెక్టు పూర్తయ్యాక వచ్చే ఆదాయంలో ఆ కంపెనీల వాటా 58 శాతమైతే, ప్రభుత్వానిది 42 శాతం మాత్రమే. ఇంతకన్నా అన్యాయమైన, పనికిమాలిన ఒప్పందం వేరే ఉంటుందా? పైగా దాని వివరాలు గోప్యంగా ఉంచారు. కన్సార్టియంకు దీటుగా, అంతకన్నా తక్కువ వ్యయానికి తాము పూర్తిచేయగలమని ఏ సంస్థ అయినా ముందుకు రావాలంటే వారికి తగినంత సమాచారం అందుబాటులో ఉంచాలన్న ఇంగిత జ్ఞానం పాలకులకు లేకపోయింది. ప్రతిపక్షాలు కాదుగదా... ఇఏఎస్ శర్మ వంటి విజ్ఞులు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబే లేదు. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం నిలదీస్తే నీళ్లు నమిలి స్టే ఇచ్చే స్థితిని తెచ్చుకున్నది బాబు ప్రభుత్వమే. లొసు గులున్నాయని చెబుతున్నవారిని అభివృద్ధి నిరోధకులుగా, ఉన్మాదులుగా ముద్ర వేస్తూ ఇన్నాళ్లూ కాలక్షేపం చేసిన ప్రభుత్వం నిజాయితీగలదైతే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగేది. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే వేరుగా ఉండేది. అందుకు బదులు స్టే ఉత్తర్వులపై అప్పీల్కెళ్లాలని సర్కారు భావిస్తోంది. ఈ దశలో అయినా కేంద్రం జోక్యం చేసుకుని హితవు చెప్పాలి. లేనట్టయితే ఈ మకిలి తనకూ అంటుతుందని గ్రహించాలి. -
58 కంపెనీలను అమ్మిన సంగతి గుర్తులేదా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్ బిజినెస్‌మ్యాన్ అవార్డు వచ్చిందని, దానికి నిజంగా ఆయన అర్హుడేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 కంపెనీలను అమ్మేసిన విషయం ఆయనకు గుర్తులేదు గానీ, హైటెక్ సిటీ ఒక్కటి కట్టానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో ఇంత కంటే పెద్ద వ్యాపారమే జరుగుతోందని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీకి ప్రభుత్వం భూమి ఇవ్వడమే కాక, 12వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని చెప్పారు. అందులో 3137 కోట్లు అంతర్గత మౌలిక సదుపాయాలకు, మరో 5600 బయటి మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తోందన్నారు. వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా 12వేల కోట్లు ప్రభుత్వమే పెట్టుబడిగా పెడుతుంటే.. సింగపూర్ కంపెనీలు కేవలం రూ. 320 కోట్లు మాత్రమే పెడుతున్నాయని తెలిపారు. అయితే.. ఇంత పెడుతున్న ఏపీ సర్కారుకు కేవలం 42 శాతం, సింగపూర్ కంపెనీలకు మాత్రం 58 శాతం ఇస్తున్నారని అన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కుంభకోణమని మండిపడ్డారు. చంద్రబాబుకు ఎక్కడా పబ్లిక్ ఇంట్రెస్టు లేదని, ఉన్నదంతా ప్రైవేటు ఇంట్రెస్టేనని ఎద్దేవా చేశారు. ఇది స్విస్ చాలెంజా, చంద్రబాబు గారి సూట్‌కేసు చాలెంజా చెప్పాలన్నారు. ప్రభుత్వం వాళ్లకు ఇచ్చేది 1690 ఎకరాలు అయితే, అందులో 50 శాతం అంటే.. 845 ఎకరాలే తిరిగి వస్తాయని, వాటిని కనీసం ఎకరా 14 కోట్లకు అమ్మితేనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. కానీ, కేవలం 4 కోట్ల అప్సెట్ ప్రైస్‌కు ఇచ్చేయడం వెనక ఆంతర్యం ఏంటని గోవర్ధన రెడ్డి నిలదీశారు. వాళ్లు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు తిరిగి కట్టకపోయినా, 20 ఏళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా భరించేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమని.. అందులో లబ్ధి పొందేది మాత్రం సింగపూర్ కంపెనీలని తెలిపారు. స్విస్ చాలెంజ్ లోపభూయిష్టం అని కేల్కర్ కమిటీ చెప్పినా ఇంతవరకు కేంద్రం దాన్ని పట్టించుకోలేదని అన్నారు. వీళ్ల వ్యవహారం అంతా గుర్రం వెనక బండి కాకుండా.. బండి వెనక గుర్రం కట్టినట్లుందని మండిపడ్డారు. ఇక నిబంధనల విషయంలోనూ మతలబులు జరిగాయని కాకాణి చెప్పారు. భారతదేశం బయట ఎక్కడైనా అనుభవం ఉండాలని, లే అవుట్ చేయాలని, దానికి మార్కెట్ చేసి ఉండాలని, బయట 25వేల మంది సిబ్బందిని నియమించి ఉండాలని నిబంధనలు పెట్టారని.. అంటే, కేవలం సింగపూర్ కంపెనీని రంగంలోకి తీసుకురావాలని వాళ్లకు ఉన్న అర్హతలను మాత్రమే నియమ నిబంధనలుగా పెట్టారని తెలిపారు. అసలు స్విస్ చాలెంజ్ విధానమే లోపభూయిష్టం అంటే.. కనీసం అందులో పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా పట్టించుకోలేదని, వీటిని ఏమీ ఆలోచించకుండా బరితెగించిన పద్ధతిలో చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు కోర్టులో హౌస్ మోషన్ తిరస్కరించారు కాబట్టి రేపు లంచ్ మోషన్ అంటున్నారని, ఏది ఏమైనా రాష్ట్ర సంపదను దోచుకోవాలి తప్ప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వాళ్లు మానసికంగా సిద్ధపడిపోయారని అన్నారు. ఎలాగోలా అప్పీలుకు వెళ్లి దాన్ని నసాగిస్తామంటున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాల మీద, తాము వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని గోవర్ధన రెడ్డి డిమాండ్ చేశారు. -
58 కంపెనీలను అమ్మిన సంగతి గుర్తులేదా?
-
అనగనగా ఓ..స్విస్ కథ
-
స్విస్ చాలెంజ్‌పై స్టే .
-
స్విస్ చాలెంజ్‌పై స్టే
-
స్విస్ చాలెంజ్‌పై స్టే
నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలిపివేత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ ప్రతీ చర్యను తప్పుపట్టిన న్యాయస్థానం.. ఒక్కో తప్పును ఎత్తిచూపి.. దానిపై సుదీర్ఘంగా చర్చించిన కోర్టు ఆదాయ వివరాల బహిర్గతం తప్పనిసరి.. అది కూడా ప్రాథమిక దశలోనే వెల్లడించాలి చెప్పకపోవటం ఏపీఐడీఈ చట్టానికి విరుద్ధం వివరాలు లేకుండా పోటీ ప్రతిపాదనలు అసాధ్యం ఇక్కడంతా రివర్స్‌లో ప్రక్రియ ప్రారంభమైంది ప్రతిపాదనలు తమకే తెలియవని ప్రభుత్వం ఒప్పుకుంది అలాంటప్పుడు అవి రాష్ట్రానికి ప్రయోజనమనే నిర్ణయానికి ఎలా రాగలరు? సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత నిర్మాణాన్ని చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అలా బహిర్గతం చేయకపోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆదాయ వివరాలు ఎంత మాత్రం యాజమాన్య సమాచారం (ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్) కిందకు రావని పేర్కొంది. ఆదాయ వివరాల సమాచారం తమ ముందు లేకపోవడంవల్ల.. పోటీ ప్రతిపాదనలు సమర్పించే విషయంలో ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులకు తగినంత సమయం లేకపోయిందని తెలిపింది. స్విస్ ఛాలెంజ్ విధాన ప్రక్రియ మొదట స్థానిక ఏజెన్సీతో మొదలై, చివరకు ప్రభుత్వం వద్దకు చేరుకుంటుందని, అయితే ఇక్కడ ‘రివర్స్’లో ప్రక్రియ ప్రారంభమైందని ఆక్షేపించింది. తమకు ఎంత ఆదాయం వస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికే తెలియనప్పుడు, సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలు రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ధారణకు రావడం సాధ్యం కాదని పేర్కొంది. కన్సార్టియం ప్రతిపాదనలకు ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు చాలా స్పల్పమని అభిప్రాయపడింది. కోర్టు జోక్యంతో గడువు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు ఈ సందర్భంగా తప్పుపట్టింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు మొత్తం ప్రక్రియను నిలుపుదల చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. లేనిపక్షంలో పిటిషనర్లకు, రాష్ట్రానికి, ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు గడువు 20 సంవత్సరాలని, అందువల్ల స్టే ఇవ్వడం వల్ల ప్రాజెక్టు అమల్లో జరిగే స్వల్ప జాప్యం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని, అంతిమంగా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ అక్టోబర్ 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం 56 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ధర్మాసనం ముందుకు అప్పీలు దాఖలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బుధవారం అప్పీలు దాఖలుకు అవకాశం ఉంది. మధ్యంతర ఉత్తర్వుల వివరాలిలా ఉన్నాయి.... ప్రాథమిక దశలోనే వెల్లడించాలని ధర్మాసనమే చెప్పింది... భూముల కేటాయింపులు, కాంట్రాక్టుల అప్పగింత తదితర విషయాలన్నీ రాజ్యాంగానికి లోబడే జరుగుతున్నాయా? అన్న దాన్ని పరీక్షించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలు సహేతుకంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిష్పాక్షికంగా, ఆరోగ్యకరమైన పోటీతో, అందరికీ సమానావకాశాలు కల్పించేలా ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుత కేసులో ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ఆస్తుల ధర్మకర్తలుగా తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో చూడాల్సింది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసేందుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ప్రభుత్వం చట్ట ప్రకారమే అనుసరించిందా? లేదా? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) యాక్ట్ 2001లోని సెక్షన్ 2 (ఎస్ఎస్) ప్రకారం ప్రధాన ప్రతిపాదకుడిగా సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయడం తప్పనిసరి. అయితే యాజమాన్య సమాచారమన్న కారణంతో దానిని సీల్డ్ కవర్లో ఉంచి పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులకు, ప్రజలకు తెలియచేయకపోవడం చట్ట విరుద్ధమే అవుతుంది. కోర్టు జోక్యంతో ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆదాయ వివరాలు బహిర్గతం చేస్తామని చెప్పింది. అయితే ప్రాథమిక దశలో కాకుండా.. క్వాలిఫైడ్ బిడ్లు తెరిచిన తరువాత చెబుతామంది. ప్రతిపాదనలన్నింటినీ ప్రాథమిక దశలోనే వెల్లడించాలని ఇదే హైకోర్టు ధర్మాసనం ఐక్యాచ్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వర్సెస్ ప్రకాశ్ ఆర్ట్స్ కేసులో తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది. అయితే ఈ తీర్పు ఈ కేసుకు వర్తించదని అటార్నీ జనరల్ చేసిన వాదనలతో నేను ఏకీభవించడం లేదు. అటు చట్టం చూసినా, ఇటు హైకోర్టు ధర్మాసనం తీర్పును చూసినా కూడా ప్రధాన ప్రతిపాదకుడి ప్రతిపాదనలను ప్రాథమిక దశలో వెల్లడించి తీరాలి. చూడకుండానే రూ.3వేల కోట్ల ప్రాజెక్టు మొదలుపెట్టడం సరికాదు.. అటు ప్రభుత్వం గానీ, ఏపీఐడీఈ చట్టం కింద ఏర్పాటైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ గానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ గానీ సింగపూర్ కన్సార్టియం సీల్డ్ కవర్లో సమర్పించిన ఆదాయ వివరాలను చూడలేదని అటార్నీ జనరలే అంగీకరించారు. అసలు ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ ఎంత మాత్రం కాదు. సింగపూర్ కన్సార్టియం అడిగింది కాబట్టి అది యాజమాన్య సమాచారం అవుతుందనడం ఎంత మాత్రం సరికాదు. సెక్షన్-2(ఎస్ఎస్) ప్రకారం బహిర్గతం చేయకపోవడానికి ఆదాయ వివరాలు ఎంత మాత్రం అతీతమైనవేవీ కావు. యాజమాన్య సమాచారం సాధారణంగా పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, డిజైన్ల వంటి మేథోపరమైన ఆస్తులకు సంబంధించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఒక కాంట్రాక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన ఎంత మాత్రం యాజమాన్య సమాచారమే కాదు. రవి డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు సైతం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో పారదర్శకత చాలా ముఖ్యమని గట్టిగా చెప్పింది. ఆదాయ వివరాలు యాజమాన్య సమాచారమని ప్రభుత్వం ఒకవైపు చెబుతూ, మరోవైపు ఆ వివరాలను మొదటి దశ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన బిడ్డర్లకే చెబుతామనడం పరస్పర విరుద్ధంగా ఉంది. ఒక అది యాజమాన్య సమాచారమైతే దానిని పూర్తిగా రహస్యంగానే ఉంచి తీరాలి. సెక్షన్-2(ఎస్ఎస్) ప్రకారం కూడా దానిని బహిర్గతం చేయడానికి వీల్లేదు. కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికి గానీ, సీఆర్డీఏ అధికారులకు గానీ తెలియకుంటే, అసలు ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా రాగలరు? వాణిజ్యబిడ్, అందులో నిబంధనలు, ఇతర ప్రతిపాదనలు తెలుసుకోకుండానే వారు ఎలా స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరిస్తున్నారు? సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలేవీ తెలియకుండానే, రూ.3వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు కోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిన మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. మొత్తం ‘రివర్స్’లోనే జరిగింది.. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం... ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు అనుసరించిన విధాన ప్రక్రియలో కూడా చాలా అవకతవకలున్నాయి. ఐపీఐడీఈ చట్టంలోని సెక్షన్-19-2 ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదకుడు తమ ప్రతిపాదనలను మొదట స్థానిక ఏజెన్సీ అయిన సీఆర్డీఏకు సమర్పించాలి. ఆ ప్రతిపాదనలను చూసి ప్రధాన ప్రతిపాదకుడికి ఆ ప్రాజెక్టు చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత ఇన్‌ఫ్రాస్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాలి. తరువాత ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లాలి. అయితే ప్రస్తుత కేసులో మొత్తం వ్యవహారం ‘రివర్స్’లో జరిగింది. కన్సార్టియం ముందు తమ ప్రతిపాదనలను నేరుగా ప్రభుత్వానికే సమర్పించింది. తరువాత ప్రభుత్వం నుంచి హైపర్ కమిటీకి వెళ్లాయి. (హైపర్ కమిటీ ఏర్పాటును చట్టం చెప్పలేదు). ఆ తరువాత సీఆర్డీఏకు... అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరి, మళ్లీ అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ రివర్స్ విధానం జరిగిన విషయాన్ని అటార్నీ జనరల్ సైతం అంగీకరించారు. ఈ రివర్స్ విధానం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ స్వతంత్రత ప్రభావితమైంది. ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు, దానికి విరుద్ధంగా వెళ్లేందుకు సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ వంటి అధికార సంస్థలు ఇబ్బంది పడుతాయి. పాలనలో ఇది ప్రత్యక్ష అనుభవమే. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్ఫ్రా అథారిటీ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే వాస్తవానికి అలా జరగనే లేదు. ఈ రివర్స్ విధానం వల్ల నష్టం లేదని, అంతిమంగా మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రభుత్వమే చెబుతుందన్న అటార్నీ జనరల్ వాదనలతో ప్రాథమిక ఆధారాలను బట్టి ఏకీభవించలేకపోతున్నా. ప్రతిపాదనలను మొదట ప్రభుత్వానికి సమర్పించాలని చట్టం ఎక్కడా చెప్పడం లేదు. దీనిని బట్టి ఈ మొత్తం వ్యవహారంలో చట్ట ప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియ నుంచి పక్కకు వెళ్లినట్లు స్పష్టమవుతోంది. విదేశీ అనుభవం వివక్షాపూరితం... పక్షపాతాన్ని, ఏకపక్ష విధానాలను నిరోధించేందుకు విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానాలను న్యాయపరంగా సమీక్షించవచ్చునని టాటా సెల్యూలర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన పత్రికా ప్రకటనలో చట్టానికి లోబడే పనిచేస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి పోటీ ప్రతిపాదనల నోటిఫికేషన్, తదానుగుణ సవరణ నోటిఫికేషన్ జారీనే చట్ట విరుద్ధంగా జరిగింది. ఇది విధానపరమైన అవకతవకే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ అధికారి కూడా సహేతుకంగా, నిష్పాక్షికంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదు. తక్కువ వ్యయంతో కూడుకున్న ‘రాజీ’ నిబంధనలను పక్కనపెట్టి, వ్యయంతో కూడిన లండన్‌లోనే కూర్చొనే చేసే మధ్యవర్తిత్వ క్లాజ్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఇక పోటీ ప్రతిపాదనల నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతల విషయానికొస్తే, ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పక్షపాతంతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు విస్తృతిని దృష్టిలో పెట్టుకుని, సాంకేతికంగా, ఆర్థికంగా సింగపూర్ కన్సార్టియంతో సరితూగే లేదా వారికన్నా ఎక్కువ అర్హతలున్న వారికే పనులు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ అర్హతలు నిర్దేశించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదన ఎంత మాత్రం సహేతుకంగా లేదు. భారతదేశం వెలుపల అన్న ప్రభుత్వం, అభివృద్ధి చెందిన దేశాల్లోనే కార్యకలాపాలు నిర్వహించి ఉండాలని ఆ షరతుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ అలా చెప్పి ఉంటే అది సమర్థనీయమయ్యేదే. పిటిషనర్లకు జోక్యం చేసుకునే అర్హత ఉంది... పిటిషనర్లకు ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేకపోతున్నా. ఇందుకు ఓ ఉదాహరణనిస్తున్నా. ఓ ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారతదేశం వెలుపల డిగ్రీ సాధించి ఉండాలన్న నిబంధన పెట్టింది. ఈ నిబంధనను ఆ అభ్యర్థి సవాలు చేశారు. ఆ నిబంధనను సంతృప్తిపరచడం లేదన్న కారణంతో ఆ వ్యక్తి ఆ నిబంధనను సవాలు చేయడానికి వీల్లేదని చెప్పగలమా? చెప్పలేం. అర్హత నిబంధనలపై ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం వేరు... అర్హత సాధించిన తరువాత ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం వేరు. తన న్యాయపరమైన హక్కులకు విఘాతం కలుగుతుందని భావించిన ఏ వ్యక్తయినా కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు. అలాగే ఈ కేసులో తన హక్కులకు భంగం కలుగుతుందని పిటిషనర్లు భావించారు కాబట్టే కోర్టుకు వచ్చారు. తుది విచారణలో అర్హతలు, నిబంధనల చట్టబద్ధత తేలుతుంది. ఈ కేసులో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనలు ఎలా ఉందంటే ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు అంటే.. బిడ్డింగ్‌కు అర్హత ఉన్నవారు.. అన్న అర్థంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు అంటే అర్హత లేని వారు అని కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తి అర్హత లేకపోయినా బిడ్ దాఖలు చేయవచ్చు. బిడ్ దాఖలు చేసిన తరువాత అర్హత ఉందా? లేదా? తేలుతుంది. కాబట్టి వారికి కోర్టును ఆశ్రయించే అర్హత, ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదనడం సరికాదు. లోపాలను సరిదిద్దుకునేందుకే కోర్టు జోక్యం... ఈ కేసులో రాజధాని నిర్మాణానికి విరుద్ధంగా ఏవైనా మధ్యంతర ఉత్తర్వులిస్తే దాని ప్రభావం దారుణంగా ఉంటుందని అటార్నీ జనరల్ చెప్పారు. ఉత్తర్వులిచ్చే ముందు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అయితే ఈ అంశాల విషయంలో కోర్టు స్పృహలోనే ఉంది. అసాధారణ కేసుల్లో విధానపరమైన అవకతవకలు, ఏకపక్ష నిర్ణయాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని టాటా సెల్యూలార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి కార్యాక్రమాల ప్రక్రియను న్యాయస్థానాలను సాధారణంగా నిలుపుదల చేయబోవని, అయితే స్విస్ ఛాలెంజ్ పద్ధతి విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధాన ప్రక్రియలో లోపాలు ఉన్నందున వాటిని ఆదిలోనే సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేందుకు వీలుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సవరణ నోటిఫికేషన్ ప్రకారం బిడ్ల సమర్పణకు తుది గడువు సెప్టెంబర్ 13 చివరి తేదీ. ఆదాయ వివరాలు లేకుండా పోటీ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం లేకపోవడంతో టెండర్ నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తున్నా... అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బహిర్గతం చేయకపోతే.. ‘ఛాలెంజ్’ ఎలా చేస్తారు..? ఒకరు చేసిన సవాలుకు మరొకరు స్పందించేందుకు వీలు కల్పిస్తున్నందువల్లే దీనిని ‘ఛాలెంజ్’ అన్నారు. ఇక్కడ సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయకపోతే ఆ ప్రతిపాదనలను ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఎలా ‘ఛాలెంజ్’ చేయగలుగుతారు? ప్రతిపాదనలు బహిర్గతం కానప్పుడు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరైనా కూడా ఎందుకు ఉత్సాహం చూపుతారు? దీనివల్ల స్విస్ ఛాలెంజ్ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? సెక్షన్-2(ఎస్ఎస్) ప్రకారమే స్విస్ ఛాలెంజ్ విధానం అమలు కావాలంటే ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే బహిర్గతం చేసి తీరాలి. సెక్షన్-2 (ఎస్ఎస్) ప్రకారం స్విస్ ఛాలెంజ్ లేకపోతే అది సీల్డ్ టెండర్ ప్రక్రియే అవుతుంది. అందువల్ల ఐక్యాచ్ కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేను, చట్ట నిబంధనలను ప్రభుత్వం అమలు చేయాల్సిందే. గుర్రానికి ముందు బండి ఉంచారు... ప్రధాన ప్రతిపాదకుడి వాణిజ్య బిడ్‌ను తెరిచినప్పుడు అందులో ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రయోజనాలకు అనుకూలంగా లేకపోతే ఆ ప్రతిపాదనలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అటార్నీ జనరల్ చెప్పారు. అయితే వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. చట్ట నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాణిజ్యపరమైన ప్రయోజనాలను అధికారులు ముందు చూడాలి. ఆ తరువాతే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించాలి. కాని అధికారులు అందుకు విరుద్ధమైన విధానాన్ని అనుసరించారు. మొదట స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించి, ఆ తరువాత వాణిజ్యబిడ్లను పరిశీలిస్తామంటున్నారు. ఇది ‘గుర్రానికి ముందు బండి ఉంచడమే’. ఇది విధానపరమైన అవకతవకే కాక, ప్రజా ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టి వేయడమే అవుతుంది. ఒక ప్రక్రియను నిర్దిష్ట విధానంలోనే చేయాలని చట్టం చెబుతుంటే అధికారులు ఆ ప్రక్రియను ఆ విధానంలోనే చేయాలి. ప్రభుత్వం, అధికారాలు ఓ చట్టం కింద పనిచేస్తుంటే, వారు ఆ చట్టం సృష్టించిన జీవులు మాత్రమే. వారు ఆ చట్టం నాలుగు గోడల మధ్యే పని చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లపై పిటిషన్లు... 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడిగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిషనర్ గత నెల 18న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో తరువాత గడువు తేదీని పెంచడంతోపాటు బిడ్ల ప్రక్రియను రెండుగా విభజిస్తూ గత నెల 28న ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, వేదుల వెంకటరమణ... సీఆర్డీఏ, పురపాలకశాఖల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ల వాదనలు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విన్నారు. అనంతరం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన న్యాయమూర్తి సోమవారం ఉదయం తన నిర్ణయాన్ని వెలువరించారు. మూడు ప్రశ్నలు లేవనెత్తిన న్యాయమూర్తి... న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రధానంగా మూడు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక్కో ప్రశ్నకు సవివరంగా సమాధానమిచ్చారు. 1. పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిషనర్ గత నెల 17న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్, 28న జారీ చేసిన సవరణ నోటిఫికేషన్లలో జోక్యం చేసుకునే పరిధి పిటిషనర్లకు ఉందా? 2. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు వీలుగా పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందు ఉంచగలిగారా? 3. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందా? -
‘స్విస్ చాలెంజ్’పై సమాధానమేదీ? : రామచంద్రయ్య
సీఎం చంద్రబాబుకు రామచంద్రయ్య ప్రశ్న సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టడంపై ప్రశ్నించిన విపక్షాలు, మేధావులు, ప్రజా సంఘాలను ఉన్మాదులుగా అభివర్ణించిన సీఎం చంద్రబాబునాయుడు.. అమరావతిని రహస్యంగా చేపట్టడం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించడంపై ఏమంటారని శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య నిలదీశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు ప్రజలు తనకు సీఎం పదవి అనే లెసైన్స్ ఇచ్చారని భావించడం మంచిది కాదని చంద్రబాబుకు గురువారం ఓ ప్రకటనలో ఆయన హితవు పలికారు. రాజధాని నిర్మాణంపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఈ అక్రమ విధానాలకు వంత పాడలేక ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారని వివరించారు. -
సింగపూర్ కంపెనీలకు పరిహారంగా ప్రజల సొమ్మా?
-
మ్యాచ్ ఫిక్స్డ్ ఛాలెంజ్..!
-
స్విస్ ఛాలెంజ్‌లో ఎందుకీ లోగుట్టు ?
-
స్విస్ చాలెంజ్‌పై ఏడు కంపెనీల ఆసక్తి
ప్రీ బిడ్ సమావేశంలో సందేహాల వ్యక్తీకరణ సాక్షి, అమరావతి: సీడ్ రాజధానిలోని స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పిలిచిన బిడ్‌పై ఏడు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. దీనికి సంబంధించి ప్రీ బిడ్ సమావేశం సోమవారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, రాంకీ గ్రూపు, అలియన్స్ ఇన్ఫ్రా, చైనాకు చెందిన జీఐఐసీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీలు పాల్గొన్నాయి. సీడ్ రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన కన్సార్టియం అసెండాస్-సిన్‌బ్రిడ్జి అండ్ సెంబ్ కార్ప్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇంతకంటె మెరుగైన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ స్విస్ చాలెంజ్ విధానంలో గత నెల 17న సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న ఏడు కంపెనీలూ తమ సందేహాలు వ్యక్తం చేశాయి. వీటిని లిఖిత పూర్వకంగా ఇస్తే వాటికి తగిన సమాధానాలను ఇ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో పొందుపరుస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను చాలెంజ్ చేస్తూ సెప్టెంబర్ 1లోపు ఎవరైనా బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉంది. సమావేశంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ రామమనోహరరావు, ఎకనామిక్ డెవలప్మెంట్ డెరైక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్విస్ ఛాలెంజ్‌పై ‘కాగ్’కు ఫిర్యాదు
స్విస్ ఛాలెంజ్ విధానం పేరిట రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధపడడం వెనుక భారీ కుంభకోణం ఉందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ విమర్శించారు. అందుకే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు కూడా వెల్లడించకుండా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని ఆరోపించారు. ‘రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి చట్టం ( ఏపీఈడీఈఏ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సింగపూర్ సంస్థలు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వర్తింపజేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్‌కు ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు. ప్రభుత్వం గాని, ప్రభుత్వ ఏజెన్సీకి గానీ కనీసం 52 శాతం వాటా ఉన్న సంస్థలకే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వర్తింపజేయాలని ఏపీఈడీఈఏ చట్టం స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. కానీ, అమరావతి నిర్మాణంలో సీఆర్డీఏకు 48 శాతం మాత్రమే వాటా ఇచ్చినందున స్విస్ ఛాలెంజ్ విధానం వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని శర్మ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఎవరైనా న్యాయస్థానంలో సవాల్ చేస్తే మొత్తం ప్రక్రియ నిలిచిపోయే అవకాశాలున్నాయన్నారు. అప్పుడు సింగపూర్ సంస్థలు తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే ఎంతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. అసలు స్విస్ ఛాలెంజ్ విధానం అన్నది భారీ అవినీతికి ఆస్కారమిస్తున్న లోపభూయిష్టమైన ప్రక్రియ అని కేల్కర్ కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌గా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకత్వానికి వివరించాల్సి బాధ్యత ప్రధాన కార్యదర్శి టక్కర్‌పై ఉందని కూడా ఆయన తేల్చిచెప్పారు. లేకపోతే ఈ భారీ కుంభకోణానికి, అక్రమాలకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకత్వంతోపాటు ఉన్నతాధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని శర్మ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నిగ్గు తేల్చాలని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్)కు ఫిర్యాదు చేస్తున్నానని కూడా ఆయన వెల్లడించారు. అవినీతి నిరోధక శాఖ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తానన్నారు. -
స్విస్ ఛాలెంజ్‌కు తూట్లు
-
స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రయోజనాలకు హానికరమైన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేసి రాజధాని పనుల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ సంస్థలతో చేసుకుంటున్న ఈ ఒడంబడికలో పారదర్శకత లేదని, అది పూర్తిగా చీకటి ఒప్పందమని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థం, దోపిడీ చేసే దురాలోచనతోనే ఈ విధానాన్ని సీఎం అమలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తున్నామని, ఇది కాదని ఎవరైనా ముందుకు వస్తే కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన తరువాత మరే సంస్థలైనా ముందుకు వస్తాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. స్విస్ విధానం ఎంత మాత్రం సరైనది కాదని పారదర్శకత ఉండదని, అమలు చేస్తే ప్రమాదమని 2015 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పేర్కొందన్నారు. అలాగే ఏపీ మౌలిక సదుపాయాల శాక ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ ఈ పద్ధతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ వాటిని ఉల్లంఘించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన అన్నారు. కేంద్రం సహా అంతా వ్యతిరేకిస్తున్న ఆ లోపభూయిష్టమైన విధానాన్నే అమలు చేయాలని ఎందుకు బరితెగిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. దేశంలో రాజధాని నిర్మించేంతటి కంపెనీలున్నాయా అని సీఎం మాట్లాడ్డం అందరినీ అవమానించడమేనన్నారు. రేపు ఎన్నికల అనంతరం మరో ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి ఈ చీకటి ఒప్పందాలను రద్దు చేస్తే భారీగా పరిహారం చెల్లించాలని సింగపూర్ సంస్థలు కోరిన కోర్కెను మంత్రివర్గం ఆమోదించారన్నారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇలాంటి ఒప్పందాలను వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే భారీ పరిహారం చెల్లించాలా? ఏం విడ్డూరం ఇది! రాష్ట్ర ప్రజలారా గమనించండి దీని వెనుక ఎంత దోపిడీ దాగి ఉందో... అని బొత్స అన్నారు. ప్రభుత్వం మారితే అన్న అనుమానం మంత్రివర్గ సభ్యులకు రావడం చూస్తే ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉండదని వారే అంగీకరించిట్లని ఆయన అన్నారు. రాజధానిని అడ్డుకుంటున్నామని తమపై చేస్తున్న విమర్శల్లో నిజంలేదని, తాము అడ్డుకుంటున్నది రాజదాని నిర్మాణంలో సాగుతున్న అవినీతి, దోపిడీలనేనని బొత్స స్పష్టం చేశారు.