కృష్ణా పుష్కరాల్లో టెండర్లు లేకుండా చేసిన పనులకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది.
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో టెండర్లు లేకుండా చేసిన పనులకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ. 49 కోట్ల పుష్కర పనులకు ఏపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సోమా కంపెనీకి రూ. 42 కోట్లు, విన్టెలీ కండక్టర్ కంపెనీకి రూ. 6.50 కోట్ల పుష్కర పనులను ఏపీ సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. పుష్కరాలకు సమయం తక్కువ ఉందంటూ పుష్కర పనులకు సంబంధించిన పనులను ఆయా కంపెనీలకు సీఎం కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
అయితే చంద్రబాబు అడ్డదారిలో కేబినెట్ ద్వారా ఆమోద ముద్రవేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివెనుక పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశంలో టెండర్ ద్వారా పుష్కర పనులు అప్పగించాలని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.