ఏపీలో నివాసం ఉంటేనే స్థానికత | AP local identity only if who will leave in andhra | Sakshi
Sakshi News home page

ఏపీలో నివాసం ఉంటేనే స్థానికత

Published Tue, Jun 21 2016 2:24 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

AP local identity only if who will leave in andhra

- ఎమ్మార్వో నుంచి సర్టిఫికెట్ పొందాలి
- వ్యక్తి ఆధారంగా జారీ
- ఉద్యోగి ఒక్కరే వెళితే ఆ ఉద్యోగికి మాత్రమే స్థానికత
- నేడో, రేపో మార్గదర్శకాలు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లి ఆ రాష్ట్రంలో నివాసం ఉంటేనే ఏపీ స్థానికత కల్పించనున్నారు. స్థానికతకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. ఈ ఫైలు సోమవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. నేడో రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానికత సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తును పరిశీలించి, అక్కడ నివాసం ఉంటున్నట్టుగా తేలితే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా మాత్రమే జారీ చేయనున్నారు.
 
 ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి మాత్రమే ఏపీకి వెళితే అతనికి మాత్రమే స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు తెలంగాణ స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి.. అంటే 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 2వ తేదీ మధ్యకాలంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఏపీకి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement