'2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ' | AP to be world's best by 2050: says cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ'

Published Mon, Aug 15 2016 12:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

'2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ' - Sakshi

'2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ'

అనంతపురం: ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్‌ జీపులో నిల్చొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎందరో మహనీయులను స్మరించుకోవాల్సి ఉందన్నారు.  రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు.

ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదవారికి పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.  దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అగ్రవర్ణాల్లో పేదవారికి రిజర్వేషన్ల అమలును పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement