
ఏటీఎంలో మాయాజాలం
వేంపల్లె: వేంపల్లె స్టేట్ బ్యాంకు ఏటీఎంలో రూ. 500 నోట్ల వరుసలో రెండు వంద నోట్లు రావడంతో ఖాతాదారుడు రూ.800లను నష్టపోయాడు. కర్ణాటకకు చెందిన హరితరుణ హల్లికు చెందిన లక్షుమయ్య వీరపునాయునిపల్లె మండలంలో విండ్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం ఏటీఎంలో రూ.19 వేలు డ్రా చేసేందుకు వెళ్లాడు. 500 నోట్లు 38 రావాల్సి ఉండగా.. కేవలం 36 రావడంతోపాటు రెండు 500 నోట్లకు బదులుగా మధ్య వరుసలో రెండు వంద నోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని అతను బ్యాంకు అధికారులకు తెలపగా.. ఎక్కడా పొరపాటు జరగలేదని.. బ్యాలెన్సింగ్ ఎంక్వైరీ (విచారణ) చేశామని చెబుతున్నారు. అలాగే పరిశీలించి బాధితునికి న్యాయం చేస్తామని బ్యాంకు మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.