
నర్సాపూర్‌లో నిందితులను చూపుతున్న సీఐ, ఎస్సై
నర్సాపూర్: శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తండాలోని భూములు పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరో 12 మంది గిరిజనులను అరెస్టు చేసినట్టు స్థానిక సీఐ, కేసు పరిశోధన అధికారి తిరుపతిరాజు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా తాళ్లపల్లి తండా పరిధిలోని ప్రవీన్‌రావు భూముల్లో పనిచేసే సిబ్బందిని నిర్బంధించారని గత నెల 29న రాత్రి సమాచారం వచ్చింది.
దీంతో అదే రాత్రి అక్కడికి వెళ్లిన పలువురు పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇటీవల పది మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా అదే కేసులో బుధవారం మరో 12 మందిని అరెస్టు చేశామని అన్నారు. తండాకు చెందిన మోతిలాల్, హీరాసింగ్, జగన్, లష్కర్‌లతోపాటు మరో ఎనిమిది మందిని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్‌ఐ వెంకటరాజగౌడ్ పాల్గొన్నారు.