ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని 21మండలాల్లో వివిధశాఖలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు తమదైన శైలిలో సేవలు అం దించిన వారికిఅవార్డు లు, ప్రశంసపత్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందించారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 10 శాఖలకు చెందిన 14మందికి, పోలీస్‌శాఖ నుంచి 13మందికి ప్రశంసపత్రాలు, అవార్డులు అందించి అభినందించారు. పదో తరగతిలో 9 జీపీఏ పైబడి సాధించిన 21మందికి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ప్రశంసపత్రాలు అందజేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తెలం గాణ సంస్కృతీసంప్రదాయాలను ప్రతి బింబించేలా చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నా యి. జెడ్పీహెచ్‌ఎస్ రోటరీనగర్ పాఠశాల విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో అలరిం చారు. ఖమ్మం రూరల్ కేజీబీవీ పాఠశాల విద్యార్థులు మిషన్‌కాకతీయ పాటకు, కృష్ణప్రసాద్ మెమోరియల్ పాఠశాల విద్యార్థులు కుయ్యం కుయ్యం కోయ అంటూ గిరిజన సంప్రదాయాన్ని ఉట్టిపడేలా నృత్యం చేశారు. జ్యోతిబాలమందిర్ హైస్కూల్ విద్యార్థులు నాది తెలంగాణ జాతి అనే పాటకు, వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ సిబ్బంది చేసిన తెలంగాణ నృత్యం కూడా ఆకట్టుకుంది.
స్టాళ్లను పరిశీలించిన మంత్రి
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి తుమ్మల ప్రభుత్వం వివిధ పథకాలను అం దించే పథకాల స్టాళ్లను పరిశీలించారు.పౌర సం బం«ధాల సమాచార అధికారి కార్యాలయం ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శనను తిలకిం చారు. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, మత్స్యశాఖ, డీఆర్‌డీఏ, మహిళా,శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖ, అటవీశాఖ, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మెప్మా ద్వారా రుణాలు ఆస్తుల పంపిణీ, షెడ్యుల్ కులాలు, సహకార సంఘం, మైనార్టీ సంక్షేమశాఖ (బీసీ) వైద్యశాఖ, జిల్లా నీటిపారుదల శాఖాధికారి, చిన్న నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్ కింద మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని అందించే విధానం, సివిల్ సప్లయీస్ ఆధ్వర్యంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అందించే స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
చేనేతబజార్, జిల్లా పరిశ్రమల శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు గుడుంబాను తరిమేద్దాం... గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జైన్‌ఇరిగేషన్ సిస్టమ్ ఆధ్వర్యంలో మొక్కలను రక్షించుకునే వి«ధానాన్ని స్పష్టంగా తెలియచేశారు.
24కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ
అవతరణ వేడుకుల్లో భాగంగా 24కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్త్రీ, శిశు అభివృద్ధి, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 54వేల విలువైన పది ట్రైసైకిళ్లు, డీఆర్‌డీఏ ద్వారా 11కోట్ల బ్యాంక్ లింకేజీని 281 6మందికి, 5కోట్ల రూపాయల స్త్రీనిధిని 685 మంది లబ్ధిదారులకు అందించారు. మెప్మా ద్వారా 248మందికి 6కోట్ల 50లక్షల బ్యాంక్ లింకేజీని, పౌరసరఫరాల శాఖ ద్వారా 65వేల రూపాయల విలువైన దీపం గ్యాస్‌కనెక్షన్లను లబ్ధిదారులకు అందించారు.
భవన నిర్మాణ కార్మికులకు వివిధ పథకాల కింద 2లక్షల 10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మరణించిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబా లకు ఒక్కొక్కరికి 80వేల చొప్పున ఇద్దరు లబ్ధిదారులకు లక్షా 60వేలు, మహిళా కార్మికులకు ప్రసూతి కోసం ఒక్కొక్కరికి 20వేల చొప్పున 40వేలు, వివాహ బహుమతి కింద 10వేల రూపాయల మంత్రి ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శ్రీలత ఆయా శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.