- అమరావతి, పోలవరం చూపుతాం..
- ప్రజలకు ప్రభుత్వ ఆఫర్
- రోజుకు 200 మందిని పంపాలని ఆదేశాలు
- తలలు పట్టుకుంటున్న అధికారులు
అనంతపురం అర్బన్:
విజయవాడలో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి ప్రజా స్పందన కరువై వెలవెల బోయింది. దీంతో ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని భావించిన ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ 200 మందిని అమరావతికి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారికి అమరావతి, పోలవంర ప్రాజెక్టును చూపుతామని ఆదేశాల్లో పేర్కొంది.
ఖర్చు ఎవరు భరించాలి?
ప్రతి రోజూ 200 మందిని అమరావతికి పంపేందుకు ఖర్చు తడిపి మోపడివుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు, వారికి భోజన ఖర్చు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహణకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, ఈ ఖర్చు ఎలాగో భరించాలో తెలియక అల్లాడుతుండగా మరో భారం మోపితే తమ పరిస్థితి ఏమిటని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.