వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పాడుబడ్డ బావిలో పడేశారు. కళ్లు తెరిచి లోకం చూడక ముందే ఆ చిన్నారి శాశ్వతంగా కన్నుమూసింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని జంగిలికొండలో జరిగింది. శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును బయటకు తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.