
అమ్మో..ఒకటో తారీఖు
పెద్ద నోట్ల రద్దుతో బడ్జెట్ తారుమారు
ఆందోళన చెందుతున్న ఉద్యోగులు
ఆర్‌బీఐ నిబంధనలతో కొత్త సమస్య
పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగులకు గుదిబండగా మారింది. నెలాఖరుకు ఇంకా పది రోజులు మిగిలి ఉన్నా ఇప్పటి నుంచే ఉద్యోగుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా బ్యాంకు ఖాతాల్లో సరిపడా నగదు ఉన్నా తీసుకోలేని పరిస్థితి. ఒకటో తారీఖున ఇంటి అద్దె.. కిరాణా బకారుులు.. పిల్లల చదువులు.. ఇలా సంసార సముద్రాన్ని ఎలా ఈదాలో తెలియక పలువురు తలలు పట్టుకుంటున్నారు. నవంబరు జీతమూ అందుకోలేమేమోనని దిగులు చెందుతున్నారు.
తిరుపతి (అలిపిరి): పెద్ద నోట్ల రద్దుతో సగటు ఉగ్యోగి బడ్జెట్ లెక్కలు తారుమారయ్యారుు. ప్రభుత్వరంగంలో పనిచేసే చిరుద్యోగుల నుంచి ఉన్నత స్థారుు అధికారుల వరకు ఒకటో తారీకంటేనే జడుసుకుంటున్నారు.
అడ్వాన్‌స ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడ్వాన్‌స సొమ్ముగా రూ.10వేలు తీసుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకుల్లో నగదు కొరత.. పాత నోట్ల మార్పిడికి వస్తున్న అవస్థల నేపథ్యంలో అడ్వాన్‌స సొమ్మును ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి. ఆర్‌బీఐ నుంచి జిల్లాకు పెద్ద మొత్తంలో నగదు వస్తేగానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగేటట్లు లేదు. బ్యాంకుల నుంచి వారంలో విత్‌డ్రా పరిమితి రూ.24 వేలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు నెలాఖరులో బ్యాంకు నుంచి డ్రా చేసే నగదుతో నెలవారి బడ్జెన్‌ను ఎలా లాక్కురావాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కళ్లముందే భవిష్యత్
డిసెంబర్ ఒకటో తారీఖు అంటే ప్రభుత్వ, ప్రైరుువేట్ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకటో తారీఖు బ్యాంకు నుంచి డ్రా చేసుకు వచ్చే నగదుతో ఇంటి అద్దె, కిరాణ దుకాణం అప్పు..ఇలా బడ్జెట్ వేసుకుంటారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ఆంక్షలతో పరిమితిగా బ్యాంకు నుంచి నగదు డ్రా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారుు. సామాన్య ఉద్యోగి బతుకు చక్రం సాఫీగా నడిచే పరిస్థితులు కనిపించడం లేదు. నెల జీతంతో ఇల్లుగడవని ఓ సగటు ఉద్యోగికి భవిష్యత్తు కళ్లముందు కనబడుతోందని పలువురు చెబుతున్నారు.
నిబంధనలు సడలించాలి
ఉద్యోగుల నెల జీతాల కింద బ్యాంకుల్లో జమయ్యే నగదును పూర్తి స్థారుులో డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ఇప్పటికే జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఆర్‌బీఐ నగదును బదిలీ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగులు నెల జీతం పొందడానికి అవస్థలు పడాల్సిందే.