రాజీ కేసులన్నీ పరిష్కారం
లీగల్ (కడప అర్బన్ ) :
జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులలో రాజీ కాదగిన కేసులన్నింటినీ పరిష్కరించాలనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. వివిధ కోర్టుల పరిధిల్లో రాజీ కాదగిన కేసునలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.
1567 కేసులకు పరిష్కారం
నేషనల్ లోక్ అదాలత్ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 1747 కేసులకుగాను 1567 కేసులకు పరిష్కారం లభించింది. బాధితులకు రూ. 1,36,82,755 నష్టపరిహారంగా లభించింది. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీనివాస మూర్తి, జడ్జి అన్వర్ బాష, మెజిస్ట్రేట్ శోభారాణి, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జివి రాఘవరెడ్డి, న్యాయవాదులు, కక్షి దారులు పాల్గొన్నారు.