
ముగిసిన క్రీడాపోటీలు
పట్టణంలో మూడురోజులపాటు కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోజరిగిన ఎస్‌కేయూ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్–ఏ క్రీడా పోటీలు మంగళవారం ము గి శాయి.
ధర్మవరం అర్బన్ : పట్టణంలో మూడురోజులపాటు కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోజరిగిన ఎస్‌కేయూ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్–ఏ క్రీడా పోటీలు మంగళవారం ము గి శాయి. ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి జెస్సీ, కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పి.చాంద్‌బాషా, పీడీ శ్రీరామ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.కృష్ణయ్య, అధ్యాపకులు రెడ్డిప్రసాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ టోర్నీలో కబడ్డీలో అత్యధికంగా 21 జట్లు పాల్గొనగా, బాల్‌బ్యాడ్మింటన్‌లో 8 జట్లు, చదరంగంలో 10, టేబుల్ టెన్నిస్‌లో 9 జట్లు పాల్గొన్నాయి. అంతర్ కళాశాలల గ్రూప్–ఏ క్రీడాపోటీల్లో పీడీ చంద్రశేఖర్, నరసింహాచారి, నా గేంద్ర, శివకృష్ణ, రామాంజనేయులు, చెస్ సీనియర్ క్రీడాకారుడు ఆదిరత్నం, అధ్యాపకులు పాల్గొన్నారు.
గెలుపొందిన జట్లు ఇవే : కబడ్డీలో ఎస్‌కేయూ జట్టు విజేతగా నిలిచింది. ఎస్‌ఎస్‌బీఎన్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాల్‌బ్యాడ్మింటన్‌లో అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విన్నర్‌గాను , శ్రీవాణి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీంరన్నర్స్‌గా నిలి చాయి. టేబుల్ టెన్నిస్‌లో అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విన్నర్‌గా , రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. చదరంగం పోటీల్లో విన్నర్‌గా ఎస్కేయూ , రన్నర్‌గా అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచాయి.