► కూరగాయలు, పండ్లు తెలంగాణలోనే పండించేలా చర్యలు: కేసీఆర్
► ప్రతి నిత్యావసర వస్తువు కల్తీమయం అవుతోంది
► ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫుడ్ ప్రాసేస్ యూనిట్లు ఏర్పాటు
► ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలోనే రైతులకు మార్కెటింగ్ యూనిట్లు ఏర్పాటు
►ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలు అందించేందుకు ఉద్యానవన శాఖ క్రియాశీలకం కావాలి: కేసీఆర్
హైదరాబాద్: వ్యవసాయం, ఉద్యానవనశాఖపై శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలు అందించేందుకు ఉద్యానవన శాఖ క్రియాశీలకం కావలని సూచించారు. ప్రతి నిత్యావసర వస్తువు కల్తీమయం అవుతోందని మండిపడ్డారు.
కల్తీ బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫుడ్ ప్రాసేస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరివేపాకును కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు' అన్నారు. కూరగాయలు, పండ్లు తెలంగాణలోనే పండించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలోనే రైతులకు మార్కెటింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.