సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ(ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ)లో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా జిల్లాల్లో నిర్వహించనున్న సంబరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
జూన్ 2న అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను జారీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. వ్యవసాయం, కొత్త విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన ముందస్తు ప్రణాళికలపైనా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
నేడు కలెక్టర్ల సదస్సు
Published Mon, May 23 2016 2:57 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement