సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ‘సాక్షి’ నేతృత్వంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహిస్తోంది.
హిందూపురం అర్బన్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ‘సాక్షి’ నేతృత్వంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహిస్తోంది. ముగ్గుల పోటీలు ఈనెల 10న స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. అదేవిధంగా 12న టీటీడీ కల్యాణ మండపంలో సంప్రదాయ వంటల పోటీలు కూడా ఏర్పాటు చేశారు.
ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిగా డబుల్‌కాట్ మంచం, రెండో బహుమతి టీక్ సోఫా, మూడో బహుమతి కింద డ్రస్సింగ్ టేబుల్ ఇస్తారు. అలాగే వంటల పోటీల విజేతలకు మొదటి, రెండు, మూడో బహుమతులుగా ఫ్రిజ్, గ్రైండర్ మిత్ మిక్సీ, కిచెన్ సెట్ ప్రదానం చేస్తారు. అంతేకాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ఆసక్తికరమైన బహుమతి అందిస్తారు. అవకాశాన్ని నియోజవకర్గంలోని మహిళలందరూ వినియోగించుకోవాలని నవీన్‌నిశ్చల్ కోరారు. ఆసక్తి ఉన్న వారు 94926 23677, 94409 75934, 97049 28123, 94412 80211 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లు, చిరునామా, ఫోన్ నంబరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.