త్వరలోనే వైఎస్సార్‌ పాలన | coming soon ysrcp Governance | Sakshi
Sakshi News home page

త్వరలోనే వైఎస్సార్‌ పాలన

Published Mon, Mar 13 2017 3:31 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

త్వరలోనే వైఎస్సార్‌ పాలన - Sakshi

త్వరలోనే వైఎస్సార్‌ పాలన

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర  అధ్యక్షుడు జక్కంపూడి
 ప్రేమ సమాజంలో వృద్ధులు, చిన్నారులకు  పళ్ల పంపిణీ


డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ) : త్వరలోనే రాష్ట్రంలో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన రాబోతుందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు మాసిపోగు రాజు, ఆళ్ల శివగణేష్, కనకల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు లాలం రాంబాబు  ఆధ్వర్యంలో ఆదివారం ప్రేమసమాజంలో అనాధ వృద్ధులు, పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్‌ సీపీ నమూనాలో ఉన్న కేక్‌ కట్‌ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం వృద్ధులు, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు.

నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై ఉద్యమిస్తున్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..ఎప్పుడు వైఎస్సార్‌ పాలన చూస్తామా? అనే ఆశతో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై వైఎస్సార్‌ సీపీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించడం సరికాదన్నారు. రైల్వేజోన్‌ సాధనకై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఆత్మగౌరవ యాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు.

కార్యక్రమంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విద్యార్థి నాయకుడు సలాంబాబు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్, యువజన విభాగం కార్యదర్శి గాలి ప్రసాద్, ఎస్సీ సెల్‌ నాయకుడు పద్మశేఖర్, నాయకులు డి.వెంకట్రావు, ఇప్పిలి శ్రీను,  ఇప్పాక శ్రీను, శంకర్‌రెడ్డి, పి.రెడ్డి, రమణారెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, మధు, సురేష్, 15వ వార్డు అధ్యక్షుడు లంకా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement