జిల్లాకు చేరిన కమిషనర్ల బృందాలు | cominitonar groups come to district | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరిన కమిషనర్ల బృందాలు

Published Mon, Sep 12 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

cominitonar groups come to district

భీమవరం టౌన్‌: అందరికీ ఇళ్లు (హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌)లో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన వంటి విషయాలను పరిశీలించేందుకు జిల్లా నుంచి వెళ్లిన మునిసిపల్, నగరపాలక సంస్థ కమిషనర్లు, ఇంజినీర్ల బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. వారం రోజుల పాటు వారు పర్యటించారు. ఒక్కో బృందంలో కమిషనర్, మునిసిపల్‌ ఇంజినీర్‌ ఉన్నారు. జిల్లాకు చెందిన ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ సాయి శ్రీకాంత్‌ బృందం ఒడిసా, భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగనర్సింహరావు బృందం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తణుకు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.అమరయ్య బృందం ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించారు. 
త్వరలో నివేదిక: పొరుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను పరిశీలించిన బృందాలు అవే విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలు, సాంకేతిక అంశాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement