నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
ఇంద్రవెల్లి : గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కామన్ సర్వీస్ రూల్స్ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ఆత్రం భుజంగ్‌రావ్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం గురువారం మండలంలోని పిట్టబొంగరం ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జగదీశ్వర్ కమిటీ వేసిందని పేర్కొన్నారు. 1975 నుంచి విధులు నిర్వర్తిస్తున్నా 010 ప్రభుత్వ అకౌంట్‌లో వేతనాలు పొందుతున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయానికి కమిటీ వేయకపోవడం శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్,రాథోడ్ ఉల్లష్,నాందేవ్,జీతేందర్,దుర్వ విఠల్,ఆర్ గోవింద్ తదితరులున్నారు.