పరిహారం మహాప్రభో!
- అర్బన్ హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న డాక్టర్లకు, ఏఎన్‌ఎంలకు పెండింగ్‌లో ఉన్న 22 నెల పరా్ఫ్ మెన్స్ అలవెన్స్ ఇప్పించండని ఏఎన్‌ఎంలు ఎన్. సువర్ణ, ఎస్.శోభారాణి, ఎం.పద్మావతి, వి.సూర్యకళ, సుజాత, వి.పద్మావతి, భాగ్యమ్మ జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు.
- అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు పెండింగ్ వేతనాలు, అమ్మ అమృతహస్త బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి జేసీకి కోరారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సక్రమంగా వేతనలు ఇవ్వడమే కాక భారీగా పెంచారని చెప్పారు
- గుత్తిపెట్రోల్ బంకు సమీపంలోని 32వార్డులోని బీఆర్ విజ్జీనగర్‌లో గురుదత్త గుడి నుంచి 160 మీటర్ల పొడవున సీసీ రోడ్డు వేయాల్సి ఉండంగా 60 మీటర్ల వరకు మాత్రమే వేసి మిగతా 100 మీటర్ల రోడ్డును పక్క వీధిలోకి మళ్లించరు. దీనిపై విచారించి న్యాయం చేయాలని జేసీకి సయ్యద్ అమ్ము, జయచంద్ర, నాగేశ్వరరావు, లాజర్, సామేల్, ప్రభాకర్, హుస్సేన్‌లు ఫిర్యాదు చేశారు.
- డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు నరేష్, సురేంద్ర, మరి, మహేష్, అశోక్ జేసీకి ఫిర్యాదు చేశారు.
- పాములపాడు మండలం బానుముక్కల గ్రామంలో తన పేరు మీద ఉన్న భూమిని తహసీల్దార్, వీఆర్‌ఓ ఆన్‌లైన్ అడంగల్‌లో నమోదు చేయడం లేదని చాకలి గంగమ్మ జేసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పాములపాడు తహసీల్దార్ నాగేంద్రతో మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా ఆన్‌లైన్ అడంగల్‌లో బాధితుల భూమిని ఎందుకు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలని ఆదేశించారు.
- బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలోని సర్వే నంబర్ 73–2లో 7.18 సెంట్ల పొలం ఉందని, ఈ పొలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నట్లు రైతు మిద్దె రామ్మోహన్‌రెడ్డి జేసీ దృష్టికి తీసుకొచ్చారు.
- ఆదోని షాహి ఈద్గాలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఆ ప్రాంతంలో లైటింగ్, శానిటేషన్, పోలీస్ ప్రొటెక‌్షన్ కల్పించాలని ఆ ఈద్గా ప్రెసిడెంట్ అలి హజ్‌మసాహబ్, సెక్రటరీ అబ్దుల్ రషీద్ అధికారులకు విన్నవించారు.