బెజవాడకు మంచిపేరు తెండి
బెజవాడకు మంచిపేరు తెండి
Published Thu, Oct 13 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
విజయవాడ సెంట్రల్ : వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్‌లో ప్రతిభ కనబరిచి బెజవాడకు మంచిపేరు తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఆకాంక్షించారు. ఈనెల 22, 23 తేదీల్లో కోల్‌కతాలో జరిగే వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వి.వెంకట ప్రణీత, మ్యాట్‌మన్ స్కూల్ నుంచి టి.మాధవ్, నలంద పబ్లిక్ స్కూల్ నుంచి ఎన్.సుశీల్‌రెడ్డి ఎంపికయ్యారు. వీరిని టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గురువారం కమిషనర్ చాంబర్‌కు తీసుకువచ్చారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అభివృద్ధి పరిచే అంశంపై 2016కు సంబంధించి ఎరువులు లేకుండా బలమైన పోషకాలతో తాము తయారుచేసిన ఆర్గానిక్ పౌడర్ గురించి విద్యార్థులు కమిషనర్‌కు వివరించారు. పాడైన పండ్లు, కూరగాయలను ఉడికించి, డ్రై చేసి దాన్ని పౌడర్‌గా తయారుచేసినట్లు తెలిపారు. ఈ ఆర్గానిక్ పౌడర్ చేపలు, రొయ్యలు, మేకలు, ఆవులు వంటి జంతువులకు ఆహారంగా వినియోగించవచ్చన్నారు. రోబో రాయల్ టీమ్స్ తరఫున తాము వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నట్లు వివరించారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలవాలని కమిషనర్ విద్యార్థులకు సూచించారు.
Advertisement