గాలిని, టీటీడీ సభ్యుడిని అరెస్ట్ చేయాలి | CPI leader Narayana Demand TDP member Sekhar Reddy Arrest | Sakshi
Sakshi News home page

గాలిని, టీటీడీ సభ్యుడిని అరెస్ట్ చేయాలి

Published Fri, Dec 9 2016 2:34 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

గాలిని, టీటీడీ సభ్యుడిని అరెస్ట్ చేయాలి - Sakshi

గాలిని, టీటీడీ సభ్యుడిని అరెస్ట్ చేయాలి

సీపీఐ నేత నారాయణ డిమాండ్
 సాక్షి, హైదరాబాద్: రూ.వంద కోట్ల పాత నోట్ల మార్పిడిలో గాలి జనార్దనరెడ్డిని.. సోదాల్లో పెద్ద ఎత్తున బంగారం, నగదు బయటపడిన కేసులో టీటీడీ సభ్యుడు శేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలగకుండా పాలకవర్గంపై సమీక్ష జరపాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. రూ.వంద కోట్ల మార్పిడిపై కారు డ్రైవర్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా గాలి జనార్దనరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డిపై జరిగిన ఐటీ దాడుల్లో భారీగా బంగారం, నగదు బయటపడటం ధార్మిక వ్యవస్థకే కళంకం తెచ్చిందన్నారు. ఇప్పటికై నా టీటీడీ బోర్డులో ధనార్జనపరులను సభ్యులు, చైర్మన్‌గా నియమించే విషయాన్ని పునరాలోచించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement