
బాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో మధు మాట్లాడుతూ... రుణమాఫీ కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మధు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని చంద్రబాబు ప్రభుత్వంపై మధు మండిపడ్డారు.