బీహార్ రాష్ట్రానికి చెందిన మెహబూబ్ సాహెబ్ (26) కాకినాడ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఓడలరేవు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఓఎన్‌జీసీ టెర్మినల్ ప్లాంట్‌లో దేవి కంపెనీకి చెందిన పవర్ క్రేన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
చికిత్స పొందుతూ క్రేన్ ఆపరేటర్ మృతి
Jul 23 2016 11:16 PM | Updated on Sep 4 2017 5:54 AM
అల్లవరం : బీహార్ రాష్ట్రానికి చెందిన మెహబూబ్ సాహెబ్ (26) కాకినాడ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఓడలరేవు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఓఎన్‌జీసీ టెర్మినల్ ప్లాంట్‌లో దేవి కంపెనీకి చెందిన పవర్ క్రేన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కంపెనీ కార్యకలాపాల్లో భాగంగా దేవి కంపెనీ నుంచి కరన్ కన్‌స్ట్రక్షన్ పవర్ క్రే¯Œæను లీజుకు తీసుకుని టెర్మినల్‌లో పనులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 13న తెల్లవారుజామున డ్యూటీకి వచ్చిన మెహబూబ్, క్రేన్ గేర్‌లో ఉన్న విషయాన్ని గ్రహించక ఇంజన్ ఆన్ చేయడంతో క్రేన్ ఒక్కసారిగా పైకి లేచింది. దీనితో క్రేన్ నుంచి ముందుకు పడిపోయాడు. రన్నింగ్‌లో ఉన్న క్రేన్ అతడి కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం 17న కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. పది రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. అల్లవరం ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement