అర్హులందరికీ పంట రుణాలివ్వాలి
Published Thu, Jul 28 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
ఓడీ చెరువు: అర్హులైన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలంటూ సీపీఐ నాయకులు, రైతులు గురువారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఆంజనేయులు, మున్నా తదితరులు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకులో రుణాలు కావాలంటే దళారులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. దీంతో చాలా మంది రైతులకు పంట రుణాలు అందక బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. బ్యాంకు అధికారులు కొంత మంది బ్రోకర్ల ద్వార రుణాలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులు బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదిస్తే కొత్త రుణాలు ఇచ్చేది లేదని వెనక్కి పంపుతున్నారని రైతులు వాపోయారు. పంట రుణం కావాలని వచ్చే ప్రతి రైతుకూ కొత్తగా రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు రమణ, రహీం, రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement